Advertisementt

విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ షూటింగ్ స్టార్ట్స్

Thu 23rd Jan 2020 02:15 PM
venkatesh,narappa,naarappa,venkatesh movie,shooting update,srikanth addala  విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ షూటింగ్ స్టార్ట్స్
Victory Venkatesh’s Powerful Film ‘Naarappa’ Shooting Begins in Ananthapur విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ షూటింగ్ స్టార్ట్స్
Advertisement
Ads by CJ

అనంతపురంలో ప్రారంభమైన విక్టరీ వెంకటేష్ పవర్ ఫుల్ మూవీ ‘నారప్ప’

‘ఎఫ్‌2’, ‘వెంకీమామ’ వంటి వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ 74వ చిత్రం ‘నారప్ప’ రెగ్యులర్‌ షూటింగ్‌ బుధవారం అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండలోని పాల్తూరు గ్రామంలో ప్రారంభమైంది. మొద‌టి స‌న్నివేశాన్ని విక్ట‌రీ వెంక‌టేష్‌పై చిత్రీక‌రించారు. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ని రివీల్‌ చేస్తూ విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ‘నారప్ప’ గెటప్‌లో విక్టరీ వెంకటేష్‌ లుక్‌ చాలా ఇంటెన్స్‌గా ఉంది. మాస్‌ గెటప్‌లో పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ సర్‌ప్రైజ్‌ చేశారు విక్టరీ వెంకటేష్‌. రాయలసీమలోని అనంతపురం పరిసర ప్రాంతాల్లోని రియలిస్టిక్‌ లొకేషన్లలో కీలక సన్నివేశాలను మొదటి షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు.

విక్టరీ వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్‌.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌, ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌, కథ: వెట్రిమారన్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌, లిరిక్స్‌: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం, ఫైనాన్స్‌ కంట్రోలర్‌: జి.రమేష్‌రెడ్డి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రామబాలాజి డి., ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఏపీ పాల్‌ పండి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ శంకర్‌, కో- ప్రొడ్యూసర్‌: దేవిశ్రీదేవి సతీష్‌, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.

Victory Venkatesh’s Powerful Film ‘Naarappa’ Shooting Begins in Ananthapur:

Venky ‘Naarappa’ Shooting started

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ