రవితేజ రాజా ది గ్రేట్ సక్సెస్ తర్వాత వరసగా మూడు సినిమాల ప్లాప్‌తో హ్యాట్రిక్ కొట్టాడు. నేల టికెట్, టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ ఆంటోని ఇలా మూడు సినిమాలు రవితేజ కెరీర్ లో దారుణమైన ప్లాప్స్. ఇక మూడు సినిమాల డిజాస్టర్స్ కొట్టిన రవితేజ ఇప్పుడు నాలుగో సినిమా డిస్కో రాజాతోను ప్లాప్ కొట్టాడనిపిస్తుంది. విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన డిస్కో రాజా సినిమా నిన్న విడుదలైంది. ప్రేక్షకులు, క్రిటిక్స్ కూడా డిస్కో రాజాకి యావరేజ్ టాక్ కూడా ఇవ్వలేదు... ప్లాప్ టాకిచ్చారు. రివ్యూ రైటర్స్ అయితే అందరూ కట్టగట్టుకుని 2 రేటింగ్‌తో రవితేజ డిస్కో రాజాని పడేసారు. వారు రేటింగ్ ఇవ్వడం కాదు గాని.. సినిమాలో ఓపెనింగ్ సీన్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ బావుంటే సరిపోదు. సినిమా మధ్యలో కూడా బావుంటేనే హిట్ కొట్టేది. అందులోని ఆనంద్ స్క్రీన్‌ప్లే చెత్తగా ఉండడంతో సినిమాకి ప్లాప్ టాక్ పడింది.
రవితేజ శాయశక్తులా సినిమాని లేపుదామనుకున్నప్పటికీ.. సినిమాలో బలం లేకపోతే.. రవితేజ కష్టపడినా వేస్ట్ కదా. సినిమాలో రవితేజ ఎనర్జిటిక్ నటనతో రెచ్చిపోయాడు. ఇక డాన్ గా, వాసుగా ఎన్నో షేడ్స్ తో రవితేజ నటనతో మెప్పిస్తాడు. అసలు ఈ సినిమాకి రవితేజ వన్ మ్యాన్ షో చేసాడని చెప్పాలి. అయినా సినిమాలో హీరోయిన్స్ వీక్, కథ, కథనం వీక్, సెకండ్ హాఫ్ సాగదీత వలన సినిమాలో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, రవితేజ నటన హైలెట్ అనేలా ఉన్నప్పటికీ.. సినిమాకి ప్లాప్ టాక్ పడింది. మరి మూడు సినిమాల డిజాస్టర్స్ సరసన డిస్కో రాజా కూడా అఫీషియల్‌గా చేరినట్టే అనిపిస్తుంది.