Advertisementt

‘RRR’ కోసం రంగంలోకి టాప్ చానెల్ అధినేత!?

Sun 26th Jan 2020 02:59 PM
rrr movie,jakkanna,ntr,ram charan,famous telugu channel chairmen,budget  ‘RRR’ కోసం రంగంలోకి టాప్ చానెల్ అధినేత!?
Famous Telugu Channel Chairmen Budget To RRR!! ‘RRR’ కోసం రంగంలోకి టాప్ చానెల్ అధినేత!?
Advertisement
Ads by CJ

బాహుబలి సినిమాతో తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న. ‘బహుబలి’కి ఏ మాత్రం తగ్గకుండా అంతకుమించి బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’. ఈ చిత్రంలో స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తున్నారు. ఇప్పటికే సుమారు 80% పైగా సినిమా షూటింగ్ అయిపోయింది. ఇప్పటి వరకూ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అధికారికంగా రాలేదు. అయితే.. లీకులు మాత్రం అస్సలు ఆగట్లేదు. తాజాగా.. యంగ్ టైగర్.. పులితో తలపడుతున్న సీన్స్‌ లీకవ్వడంతో జక్కన్న తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగు చూసింది.

భారీ బడ్జెట్ కావడంతో దానయ్యతో పాటు రాజమౌళి కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాడని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయ్. అయితే అనుకున్న దానికంటే బడ్జెట్ అవుతుండటంతో తెలుగులో ప్రముఖ చానెల్ అధినేతను రంగంలోకి దింపారట. ఆయన అక్షరాలా వంద కోట్ల రూపాయిలు ఖర్చు చేయడానికి సిద్ధపడ్డాడట. అంతేకాదు సినిమా ప్రీ రిలీజ్ మొదలుకుని అన్నీ ఈవెంట్స్ తనకే ఇవ్వాలని ముందుగానే జక్కన్నతో పాటు నిర్మాతలతో ఆ చానెల్ అధినేత ఓ మాట అనేసుకున్నాడట. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియా, ఫిల్మ్‌నగర్‌లో పెద్ద ఎత్తున వినపడుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

కాగా.. ‘RRR’ చిత్రంలో తెలంగాణ విప్లవ‌వీరుడు కొమురం భీమ్‌గా తార‌క్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా చ‌ర‌ణ్ న‌టిస్తుండగా.. అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా బ‌ట్ కీల‌క పాత్రల్లో చేస్తున్నారు. స‌ముద్రఖ‌ని రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడ్‌, ఒలివియా మోరిస్‌తో పాటు పలువురు ప్రముఖులు ఈ సినిమాలో నటిస్తున్నారు.

Famous Telugu Channel Chairmen Budget To RRR!!:

Famous Telugu Channel Chairmen Budget To RRR!!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ