Advertisementt

గోపీచంద్ ‘సీటీమార్‌’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

Mon 27th Jan 2020 08:49 PM
gopichand,seetimaarr,first look,sampath nandi,macho star  గోపీచంద్ ‘సీటీమార్‌’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌
Gopichand SEETIMAARR Movie First Look Released గోపీచంద్ ‘సీటీమార్‌’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌
Advertisement
Ads by CJ

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌, మాస్ డైరెక్ట‌ర్ సంపత్‌నంది కాంబినేషన్‌లో రూపొందుతోన్న‌ భారీ చిత్రం ‘సీటీమార్‌’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో ‘యు టర్న్‌’ లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మాత‌గా హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న‌ భారీ చిత్రం ‘సీటీమార్‌’. ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్‌గా దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. తరుణ్ అరోరా ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.  ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఈ రోజు(సోమవారం) ఉద‌యం 8.47నిమిషాల‌కి విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. ‘‘ఇటీవ‌ల హైద‌రాబాద్, రాజ‌మండ్రిలో బిగ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఈరోజు నుండి ఆర్‌.ఎఫ్‌.సిలో కొత్త షెడ్యూల్ ప్రారంభించాం. నాన్ స్టాప్‌గా షెడ్యూల్ జ‌రిపి స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. గోపిచంద్ కెరీర్‌లోనే ఇది హై బడ్జెట్ ఫిలిం. హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో ప్రెస్టీజియస్‌ మూవీగా రూపొందుతోంది. హీరో గోపిచంద్‌కి భారీ క‌మ‌ర్షియ‌ల్ మూవీ అవుతుంది..’’ అన్నారు.

మ్యాచో స్టార్‌ గోపీచంద్‌, మిల్కీబ్యూటి తమన్నా, దిగంగన సూర్యవంశి, తరుణ్ అరోరా, భూమిక, పోసాని కృష్ణమురళి, రావురమేష్, అన్నపూర్ణమ్మ, ప్రగతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: సౌందర్‌ రాజన్‌, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: డి.వై.సత్యనారాయణ, సమర్పణ: పవన్‌ కుమార్‌, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: సంపత్‌ నంది.

Gopichand SEETIMAARR Movie First Look Released:

Macho Star Gopichand, Mass Director Sampath Nandi’s Biggie, “SEETIMAARR” First Look Is Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ