Advertisementt

ఆసక్తి రేపుతున్న ‘పలాస 1978’లోని పాత్రలు

Wed 29th Jan 2020 11:34 AM
palasa 1978,tammareddy,animated book,palasa 1978 movie  ఆసక్తి రేపుతున్న ‘పలాస 1978’లోని పాత్రలు
Palasa 1978 Movie Latest Update ఆసక్తి రేపుతున్న ‘పలాస 1978’లోని పాత్రలు
Advertisement
Ads by CJ

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘‘పలాస 1978’’. తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. డైరెక్టర్ కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ విడుదలకు ముందే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. జిఎ2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరిలో విడుదలకు సిద్దం అవుతుంది. ఈ సందర్భంగా  ‘పలాస 1978’ లోని కొన్ని పాత్రలను యానిమేటెడ్ బుక్ రూపంలో పరిచయం చేసింది చిత్ర యూనిట్. ఈ బుక్‌ని సోషల్ మీడియాలో చిత్ర సమర్పకులు తమ్మారెడ్డి భరద్వాజ లాంచ్ చేసారు. ఈ యానిమేటడ్ బుక్ లో యూనిట్ పరిచయం చేసిన పాత్రలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. అణువణువునా సహాజత్వం నింపుకున్న ఈ పాత్రల మాటలు కూడా అంతే హృద్యంగా ఉన్నాయి. ముఖ్యంగా పలాస ప్రాంతం నుండి పుట్టిన మాటల లోని భావాలు లోతుగా ఉన్నాయి.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ: ‘‘ఈ సినిమాలోని పాత్రలు మాట్లాడే మాటలు రెగ్యులర్ సినిమాలలో ఉండేలా కాకుండా కంటెంట్ బేస్డ్ గా ఉన్నాయి. సినిమా కథ ఎంత సీరియస్ గా సాగుతుందో ఈ మాటలలో అర్ధం అవుతుంది. సినిమా కథ లోతుగా, సీరియస్ గా ఉండబోతుందని అర్ధం అవుతుంది. పాత్రల పేర్లు, వేష భాషలు చాలా సహజంగా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో ఒక ప్రాంతంలో జరిగిన కథ, ఇది వరకూ ఎవరూ చెప్పని కథ అంటూ మొదలైన ఈ యానిమేటెడ్ బుక్ మొదటి పేజి నుండి చివరి పేజీ వరకూ ఆసక్తిగా ఉంది. ఇందులోని పాత్రలు ప్రత్యేక ముద్రను వేసాయి’’ అన్నారు.

కథలోని పాత్రలను యానిమేటడ్ బుక్ రూపంలో పరిచయం చేసింది చిత్ర యూనిట్. విడుదలకు ముందే పరిశ్రమలో ‘పలాస 1978’ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. జిఎ2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్న ఈమూవీ తెలుగు అసురన్ అవుతుందని దర్శకుడు మారుతి కితాబిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని కథ, ఎవరూ చెప్పని కథగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫ్రిబ్రవరిలో విడుదలకు సిద్దం అవుతుంది.

రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి  పాటలు: భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ: అరుల్ విన్సెంట్, సంగీతం: రఘు కుంచె, పి.ఆర్.ఓ: జి.ఎస్.కె మీడియా, నిర్మాత : ధ్యాన్ అట్లూరి, రచన- దర్శకత్వం: కరుణ కుమార్.

Palasa 1978 Movie Latest Update:

Tammareddy Bharadwaja abotu palasa 1978 Movie 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ