టాలీవుడ్‌లో అప్పుడెప్పుడో ‘నచ్చావులే’ సినిమాలో నటించి.. ‘స్నేహితుడా’తో ప్రేక్షకులతో పర్వాలేదనిపించుకున్న నటి మాధవీలత. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రాకపోవడం.. తెలుగు సినిమాలకు విరామం ఇచ్చిన ఈ భామ 2019 ఎన్నికలకు ముందు బీజేపీ తీర్థం పుచ్చుకుంది. అంతేకాదు.. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయగా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఒక్క మాటలో చెప్పాలంటే డిపాజిట్లు కూడా కరువయ్యాయి. అటు సినిమాల్లో ఫెయిల్.. ఇటు రాజకీయాల్లో అట్టర్ ఫెయిల్ అవ్వడంతో ఈ భామ మీడియా ముందుకు రావడం బొత్తిగా మానేసింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు, కార్యకర్తలతో టచ్‌లో ఉంటూ వస్తోంది.
రేవతిలా నేనూ చచ్చిపోతానేమో!?
తాజాగా.. మాధవి ఫేస్‌బుక్ వేదికగా రాసుకొచ్చిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో.. ఇటు మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే.. ‘‘నేను కూడా ఏదో ఒక రోజు ‘ప్రేమ’ సినిమాలో రేవతిలా చచ్చిపోతాను. నన్ను మైగ్రేన్ తలనొప్పి, జలుబు, జ్వరం, నిద్రలేమి వంటి సమస్యలు బాధిస్తున్నాయి. మందులు వాడటం ఇష్టం లేకపోయినా వాడాల్సిన పరిస్థితి వచ్చింది’ అని పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు, వీరాభిమానులు షాక్ అయ్యారు. ఆ షాక్ నుంచి తిన్నగా తేరుకుని.. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలని చనిపోవద్దని మాధవికి ధైర్యం చెప్పారు. ఈ వార్త మాత్రం నెట్టింట్లో.. ఇటు మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
విరక్తి పుట్టింది అందుకే..!
‘నేను ఆరోగ్యంగానే ఉన్నా.. భవిష్యత్తులో కూడా ఆరోగ్యంగానే ఉంటానని భావిస్తున్నా. నా ఆరోగ్యం గురించి అవాస్తవాలను ప్రచురించడం మానండి. నాది చిన్న సమస్య అంతే. నేను వాడుతున్న మందులు.. బాగా ఇబ్బంది పెడుతున్నాయి. మందులు అంటే నాకు విరక్తి పుట్టింది.. అందుకే నేను అలా మొదట పోస్ట్ చేశాను’ అని మరోసారి టిక్‌టాక్ ద్వారా వివరణ ఇచ్చుకుంది. మొత్తానికి చూస్తే.. ఈమె ఇవాళ చేసిన మాత్రం గందరగోళానికి తలెత్తగా.. ఆ తర్వాత వివరణ ఇవ్వడంతో అభిమానుల్లో ఆందోళన తగ్గింది.