Advertisementt

నక్కిలీసు గొలుసు.. సుకుమార్ చేతులమీదుగా..!!

Sun 02nd Feb 2020 01:39 AM
director,sukumar,palasa 1978,movie,song,launch  నక్కిలీసు గొలుసు.. సుకుమార్ చేతులమీదుగా..!!
Palasa 1978 Movie Song Released నక్కిలీసు గొలుసు.. సుకుమార్ చేతులమీదుగా..!!
Advertisement
Ads by CJ

రక్షిత్ నటన నన్ను ఆశ్చర్య పరిచింది- ‘‘పలాస 1978’’ మూవీ నుండి నక్కిలీసు గొలుసు అనే సాంగ్ ను రిలీజ్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్

1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా  ‘‘పలాస 1978’’. తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో  రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. డైరెక్టర్ కరుణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ విడుదలకు ముందే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. జిఎ2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్న ఈ  మూవీ త్వరలో  విడుదలకు సిద్దం అవుతుంది. ‘పలాస 1978’ సినిమా చూసి,  టీంని అభినందించి    ‘పక్కన పడ్డాది చూడరో పిల్లా నాది నక్కిలీసు గొలుసు’ అనే పాటను టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ గారు లాంఛ్ చేసారు.

ఈ సందర్భంగా దర్శకుడు  సుకుమార్ గారు మాట్లాడుతూ: ‘దర్శకుడు కరుణ్ కుమార్ గారు రైటర్ గా ఉన్నప్పటి నుండి నాకు తెలుసు, ఆయన  కథలు కొన్ని నేను చదివాను చాలా బాగుంటాయి. దర్శకుడిగా తన తొలి ప్రయత్నంలోనే  వాస్తవ సంఘటనల ఆధారంగా కథను రెడీ చేసుకొని ‘పలాస 1978’ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు రక్షిత్ నటన నన్ను ఆశ్చర్యపరిచింది. కొత్త కుర్రాడు ఎలా చేస్తాడు అనుకున్నాను కానీ చాలా బాగా చేసాడు. పల్లెటూరి కుండే సంస్కృతిని తెరమీద ఆవిష్కరించే దర్శకులు తెలుగులో తక్కువ మంది ఉన్నారు. వారి కంటే  దర్శకుడు కరుణ్ కుమార్ ముందడుగు వేసాడు. మిగతా వారు ఆయన్ను ఫాలో అవ్వాలి. ఇందులో పాటలు కూడా చాలా బాగున్నాయి. ఉత్తరాంధ్ర జానపదం చాలా ఫేమస్ మా కాలేజ్ రోజుల్లో కూడా ఆపాటలే పాడుకునే వాళ్ళం. అలాంటి ఉత్తరాంధ్ర జానపదం నుండి వచ్చిన ‘పక్కన పడ్డాది చూడరో పిల్లా నాది నక్కిలీసు గొలుసు’ పాట చాలా బాగుంది. ఈ సినిమాకు మ్యూజిక్  ని అందించడమే కాకుండా ముఖ్య పాత్రను పోషించిన రఘ కుంచెను అభినందిస్తున్నాను. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. 

రక్షిత్, నక్షత్ర హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.తమ్మారెడ్డి భరద్వాజ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్ సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్దం అవుతున్న ఈ చిత్రానికి  పాటలు : భాస్కర భట్ల, సుద్దాల అశోక్ తేజ, లక్ష్మీ భూపాల, ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్, సంగీతం :  రఘు కుంచె,  పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా, నిర్మాత : ధ్యాన్ అట్లూరి, రచన- దర్శకత్వం : కరుణ కుమార్.

Palasa 1978 Movie Song Released:

Director Sukumar Launched Palasa 1978 Movie Song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ