Advertisementt

‘మెగా’కు దూరం కావాలని బన్నీ చూస్తున్నాడా?

Sun 02nd Feb 2020 01:37 PM
allu arjun,ala vaikunthapurramulo. mega family  ‘మెగా’కు దూరం కావాలని బన్నీ చూస్తున్నాడా?
Will Allu Arjun trying to get side from Mega tag ‘మెగా’కు దూరం కావాలని బన్నీ చూస్తున్నాడా?
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురములో చిత్రం నాన్ బాహుబలి రికార్డుని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఇండస్ట్రీ హిట్ గురించి ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతుంది. అయితే ఈ విషయం పక్కన పెడితే మరో కొత్త అంశం చర్చకి వచ్చింది. సాధారణంగా మెగా హీరోల సినిమాలు హిట్ అయినపుడు మెగా సక్సెస్ అనో, మెగా సూపర్ హిట్ అనో వేస్తుంటారు. కానీ అల వైకుంఠపురములో సినిమాకి అలా వేయట్లేదు.

 గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ ప్రవర్తన చూస్తుంటే మెగా అనే ట్యాగ్ నుండి బయటపడాలని చూస్తున్నట్టుగా ఉంది. ఈ విషయంలో అనుమానాలకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ మొదలుకుని ఇప్పటి వరకు జరిగిన అనేక పరిణామాలు అనుమానాలకి తావుని ఇస్తున్నాయి.  ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అల్లు కుటుంబం గురించే ఎక్కువగా మాట్లాడటం, వారి నాన్న గారి గురించి మాట్లాడడం కూడా అల్లు ఫ్యామిలీని జనాల్లోకి తీసుకెళ్ళేందుకే అని అంటున్నారు.

అల వైకుంఠపురములో సినిమాలో సైతం పాటల సీక్వెన్ కి డాన్స్ చేసే సమయంలో చిరంజీవి పాట వచ్చే ముందు పెద్దాయన పాట అని అన్నారే తప్పితే, మెగా స్టార్ అని పిలవలేదు. ఇవన్నీ చూస్తుంటే అసలు మెగా అన్న పదానికే అల్లు అర్జున్ దూరం కావాలనుకుంటున్నాడేమో అని అనిపించక మానదు. ఏది ఏమైనా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుండి వచ్చాడన్న విషయం మాత్రం కాదనలేని సత్యం.

Will Allu Arjun trying to get side from Mega tag:

Allu Arjun Trying to get a side from mega tag.. He wants crete his own

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ