Advertisementt

‘నారప్ప’ తాజా అప్డేట్ ఇదే..!

Sun 02nd Feb 2020 06:11 PM
victory venkatesh,naarappa,movie,shooting,tamilnadu  ‘నారప్ప’ తాజా అప్డేట్ ఇదే..!
Naarappa Movie Latest Update ‘నారప్ప’ తాజా అప్డేట్ ఇదే..!
Advertisement
Ads by CJ

తమిళనాడు లోని కురుమలై లో విక్టరీ వెంకటేష్ ‘నారప్ప’ యాక్షన్ సీక్వెన్సెస్

‘ఎఫ్‌ 2’, ‘వెంకీమామ’ వంటి వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ 74వ చిత్రం ‘నారప్ప’ షూటింగ్‌ అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండలోని పాల్తూరు గ్రామంలో ప్రారంభమైంది. తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా సంచలనం సృష్టించిన ‘అసురన్‌’ చిత్రానికి ఇది రీమేక్‌. ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం  ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ప్రస్తుతం తమిళనాడు లోని కురుమలైలో  ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ‘నారప్ప’ కి సంబంధించి కీలక యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యాక విక్టరీ వెంకటేష్, చిత్ర బృందం అనంతపురంలో షెడ్యూల్ కంటిన్యూ చేస్తారు. సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేశారు.

విక్టరీ వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్‌.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌, ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌, కథ: వెట్రిమారన్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌, లిరిక్స్‌: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం, ఫైనాన్స్‌ కంట్రోలర్‌: జి.రమేష్‌రెడ్డి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రామబాలాజి డి., ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఏపీ పాల్‌ పండి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ శంకర్‌, కో- ప్రొడ్యూసర్‌: దేవిశ్రీదేవి సతీష్‌, నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.

Naarappa Movie Latest Update :

Naarappa Movie Shooting in Tamilnadu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ