Advertisementt

ఒకప్పుడు స్టార్ రైటర్..చివరికి ఆ పని చేస్తున్నాడు...

Sun 02nd Feb 2020 06:38 PM
vakkantham vamshi,geetha arts,allu arjun  ఒకప్పుడు స్టార్ రైటర్..చివరికి ఆ పని చేస్తున్నాడు...
Tollywood star writer doing as fascilitator ఒకప్పుడు స్టార్ రైటర్..చివరికి ఆ పని చేస్తున్నాడు...
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో పేరొందిన సినిమా రచయితలలో వక్కంతం వంశీ కూడా ఒకడు. ఒకప్పుడు స్టార్ రైటర్ గా వెలుగొందిన వంశీ ప్రస్తుతం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో డైరెక్టర్ గా మారిపోయాడు. ఒకప్పుడు పేరు మోసిన రచయితలు వంశీ కథల కోసం, మాటల కోసం వేచి ఉండేవారు. అలాంటిది ఒక్కసారి డైరెక్టర్ గా మారి పరాజయం మూటగట్టుకున్న తర్వాత అతని పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 

 

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత వంశీకి దర్శకత్వ అవకాశాలు రాలేదు. అటు రచయితగా సినిమాలు లేకపోవడంతో వంశీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో స్క్రిప్ట్ అనలిస్ట్ గా పనిచేస్తున్నాడు. రెండేళ్ళుగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే పనిచేస్తున్న వంశీ అక్కడికి వచ్చే కథల్ని అనలైజ్ చేస్తూ ఉంటున్నాడు. అయితే తాజాగా అల వైకుంఠపురములో సక్సెస్ మీటింగ్ లో భాగంగా జరిగిన వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం వంశీ నే అని చెప్పాడు.

 

వంశీ బన్నీ త్రివిక్రమ్ ల మధ్య ఫెసిలిటేటర్ గా మారి వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చి ఈ సినిమాని పట్టాల మీదకెక్కించే ప్రయత్నం చేసాడట. ఒకప్పుడు తన కథల కోసం దర్శకులు క్యూలో నిల్చునే వారు. అలాంటిది ఇప్పుడు ఒక కథని తెర మీదకి తేవడానికి ఇద్దరు స్టార్స్ ని కలిపే పని చేయడం ఆశ్చర్యంగా ఉంది. రచయితగా వచ్చిన పేరు ఈ విధంగా చెడిపోతుందేమో అన్న భయం కూడా ఉంది.. మరి వంశీ ప్లానింగ్ ఎలా ఉందో మనకేం తెలుసు.. 

Tollywood star writer doing as fascilitator:

Star writer doing work as facilitator..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ