Advertisementt

బెల్లంకొండ సినిమాతో అను మళ్లీ వస్తోంది!

Mon 03rd Feb 2020 05:34 PM
tollywood,actress anu emmanuel,come back,bellam konda sai sreenivas  బెల్లంకొండ సినిమాతో అను మళ్లీ వస్తోంది!
Tollywood actress Anu emmanuel Come Back With Bellam Konda Movie! బెల్లంకొండ సినిమాతో అను మళ్లీ వస్తోంది!
Advertisement
Ads by CJ

తెలుగులో నాని హీరోగా వచ్చిన ‘మజ్ను’ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అను ఇమ్మాన్యూయేల్.. ఆ తర్వాత మారుతీ దర్శకత్వంలో వచ్చిన ‘శైలాజా రెడ్డి అల్లుడు’ సినిమాతో అలరించింది. ఆ తర్వాత టాప్ హీరోలైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లో అవకాశం కొట్టేసింది. అయితే ఈ స్టార్ హీరోలిద్దరూ ఈ భామకు హిట్టివ్వలేకపోయారు. అప్పటి నుంచి సరైన చిత్రం కోసం వెయిట్ చేస్తున్న అను.. తన రీ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంది. బెల్లంకొండ వారబ్బాయ్ సినిమాతో ఈ భామ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.

టాలీవుడ్‌లో తను చేసింది తక్కువ సినిమాలే అయినా తన స్టనింగ్ లుక్స్‌తో కుర్రకారు మతి పోగొట్టింది. సినిమాలు లేకపోయినప్పటికీ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో మాత్రం మంచి హాట్ హాట్ ఫొటోలతో అభిమానులు, నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తోంది. అలా చేస్తున్న ఈ భామకు పిలిచి మరీ ఓ డైరక్టర్ అవకాశమిచ్చారట. ఆయన మరెవరో కాదండోయ్ సంతోష్ శ్రీనివాస్.. కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో సంతోష్ శ్రీనివాస్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కాగా ఒకరు నభా నటేష్ అని.. మరొకరు అను అని టాక్ నడిచింది. ఇప్పుడు అఫీషియల్‌గా అను ఈ చిత్రంలో హీరోయిన్‌గా సెలక్ట్ అయిందని తెలుస్తుంది. మరి బెల్లంకొండ బాబు అయినా ఆమెకు సరైన హిట్టు ఇస్తాడేమో చూద్దాం.

Tollywood actress Anu emmanuel Come Back With Bellam Konda Movie!:

Anu emmanuel Come Back With Bellam Konda and Santhosh Srinivas Movie  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ