Advertisementt

ఈ కుర్ర డైరెక్టర్ మూవీ చెర్రీతోనా.. పవన్‌తోనా!?

Mon 03rd Feb 2020 05:57 PM
pawan kalyan,ram charan,cherry,young director,gowtham tinnanuri  ఈ కుర్ర డైరెక్టర్ మూవీ చెర్రీతోనా.. పవన్‌తోనా!?
Pawan Or Cherry.. Young Director Movie! ఈ కుర్ర డైరెక్టర్ మూవీ చెర్రీతోనా.. పవన్‌తోనా!?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లో రాణించకలేపోయిన సంగతి తెలిసిందే. అయితే అదేదో సామెత ఉంటుంది కదా.. ఎన్నెన్ని ఊర్లు తిరిగినా తిరిగి తిరిగి మళ్లీ సొంతూరుకు రావాల్సిందేనని.. అలా సినిమాలకు స్వస్తి చెప్పి వెళ్లిపోయిన పవన్ రాజకీయాల్లో ఆశించినంతగా కాదు కదా.. అట్టర్ ప్లాప్ అవ్వడంతో బ్యాక్ టూ సినిమా అంటూ వచ్చేశాడు. ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నారని తెలుసుకున్న దర్శకులు చాలా వరకు కథలు రెడీ చేసుకున్నారు. ఇప్పటికే ఆయన ‘పింక్’ రీమేక్, క్రిష్ దర్శకత్వంలో, హరీశ్ శంకర్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటనలు కూడా వచ్చేశాయి.

ఈ క్రమంలో కుర్ర డైరెక్టర్‌ డైరెక్టర్ గౌత‌మ్ తిన్ననూరి కూడా పవన్‌కు స్టోరీ వినిపించారని.. ఆయనకు స్టోరీ లైన్ నచ్చడంతో సినిమా అయితే పక్కాగా ఉంటుంది కానీ.. ఇప్పుడైతే కాదని జనసేనాని తేల్చిచెప్పినట్లు సమాచారం. అయితే.. పవన్ మెచ్చుకున్నారు కదా.. అదే చాలని స్టోరీ డెవలప్ చేసే పనిలో ఆయన నిమగ్నమయ్యారట. అయితే ఎందుకో పవన్ కరెక్టా.. లేకుంటే మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ను కలిసి అదే స్టోరీ వినిపించాడట. లైన్ బాగుందీ కానీ.. బాబాయ్ అయితే కరెక్ట్ అని తనకోసం కావాలంటే మంచి ఊపున్న కథను సిద్ధం చేయాలని సూచించారట. ఒకవేళ ఈ గ్యాప్‌లో పవన్‌తో సినిమా బెడిసికొడితే అదే స్టోరీతో చెర్రీతో చేసేయాలని డైరెక్టర్ భావిస్తున్నాడట.

కాగా.. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గౌత‌మ్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఇప్పటికే పలు ఆయన తెరకెక్కించిన ‘మళ్లీరావా’, ‘జెర్సీ’ వంటి చిత్రాలు భావోద్వేగభరిత కథలతో సినీప్రియుల మనసు దోచుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే పవన్‌తో మంచి హార్ట్ టచింగ్ సినిమా తెరకెక్కిస్తారా లేకుంటే.. ఆర్ఆర్ఆర్ తర్వాత చెర్రీతో సినిమా తెరకెక్కిస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. 

Pawan Or Cherry.. Young Director Movie!:

Pawan Or Cherry.. Young Director Movie!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ