Advertisementt

సమంత గ్లామర్ ముందు ఆయనెంత!!

Wed 05th Feb 2020 06:36 PM
glamorous,samantha,samantha akkineni,jaanu movie  సమంత గ్లామర్ ముందు ఆయనెంత!!
News About Glamorous Samantha సమంత గ్లామర్ ముందు ఆయనెంత!!
Advertisement
Ads by CJ

సమంత ప్రస్తతం భారీ క్రేజ్ ఉన్న హీరోయిన్. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌లో ఎలా నిలబడాలి..? అనేది సమంతని చూసి నేర్చుకోవాలి. అందరికి ఓ రోల్ మోడల్ లా సమంత కెరీర్ దూసుకుపోతుంది. పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ పెంచినా.. సమంత మాత్రం తన పాత్రకు ప్రాధాన్యమున్న రోల్స్ వస్తేనే సినిమాలు ఒప్పుకుంటుంది. సినిమాలు ముఖ్యమే కానీ.. నలుగురికి గుర్తుండే సినిమా చెయ్యడం అనేది మరీ ముఖ్యం అన్నట్టుగా సమంత ఈ మధ్యన చేస్తున్న సినిమాలు ఉంటున్నాయి. తాజాగా సమంత చేసిన జానూ సినిమా రేపు శుక్రవారం విడుదల కాబోతుంది. ఆ సినిమాలో ‘జాను’గా సమంత సూపర్ అనేలా కనబడుతుంది.

ఇక నటన పరంగాను, లుక్స్ పరంగాను, ప్రస్తుతం ప్రమోషన్స్ పరంగాను హీరో శర్వానంద్ సమంత ముందు తేలిపోవడం ఖాయంగా కనబడుతుంది. ఎందుకంటే జాను సినిమా మొత్తం సమంత చుట్టూనే తిరిగుతుంది. అలాగే శర్వానంద్ పాత్రకి కాస్త డైలాగ్స్ తక్కువ. ఇక లుక్స్ పరంగాను సమంత క్రేజ్ ముందు శర్వా తేలిపోతున్నాడు. ఇక శర్వా చెప్పినట్టుగా సమంత లాంటి నటి ముందు నేనెక్కడా కనబడనన్నట్టుగా ఆమె నటన ముందు శర్వా ఎలా కనిపిస్తాడా చెప్పలేం. మరోపక్క జాను ప్రమోషన్స్ లోను సమంత అందమైన గ్లామరస్ చీరకట్టులో అదరగొట్టేస్తుంది. ఏ మిడ్డీనో, ఏ ఫ్రాకో, ఏ డిజైనర్ డ్రెస్సో వెయ్యకుండా స్లీవ్ లెస్ బ్లౌజ్ తో అందమైన చీరలతో అందరి చూపు తనమీదే పడేలా చేసుకుంటుంది. మరి నార్మల్ లుక్స్ తో ఉన్న శర్వా ని చూసే కన్నా ఎక్కువగా గ్లామరస్ భామ సమంత నే చూస్తున్నారు. ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు.

News About Glamorous Samantha:

News About Glamorous Samantha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ