Advertisementt

పూర్తి ఎమోషనల్ గా వరల్డ్ ఫేమస్ లవర్...

Thu 06th Feb 2020 06:30 PM
vijay devarakonda,raashi kanna,world famous lover  పూర్తి ఎమోషనల్ గా వరల్డ్ ఫేమస్ లవర్...
World famous lover trailer looks interesting.. పూర్తి ఎమోషనల్ గా వరల్డ్ ఫేమస్ లవర్...
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ హీరోగా క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "వరల్డ్ ఫేమస్ లవర్" ట్రైలర్ ఈ రోజు విడుదల అయింది. డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ దేవరకొండ నుండి వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. డియర్ కామ్రేడ్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ సినిమాపై విజయ్ బాగా ఆశలు పెట్టుకున్నాడు. అయితే నేడు విడుదల చేసిన ట్రైలర్ ని గమనిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలువడుతున్నాయి.

 

ట్రైలర్ ని చూస్తే కథా పరంగా ఎలాంటి క్లూ కనబడకపోయినప్పటికీ పూర్తి ఎమోషనల్ కనిపిస్తోంది. ఒక అబ్బాయి నలుగురు అమ్మాయిలతో చేసే రొమాన్స్ చూపెట్టారు.. కానీ ఆ అబ్బాయి ఏ ఫేజేస్ లో వారిని ప్రేమించాడన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంది. నలుగురు అమ్మాయిలతో నడిపిన ప్రేమాయణంలో ఒకరు అతని వైఫ్ కాగా, మరొకరు అతడు ప్రేమించిన అమ్మాయిగా చూపెట్టారు. ఇక మిగతా ఇద్దరినీ అతడు కావాలనుకుంటున్నట్లుగా ఉంది. 

 

ట్రైలర్ మొత్తంగా చుస్తే విజయ్ దేవరకొండ, ఐశ్వర్య రాజేష్ ల మధ్య సాగే ఎపిసొడ్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. భార్యాభర్తలుగా వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ ఒక మధ్య తరగతి జంటకి ఏమాత్రం తీసిపోనట్టుగా ఉంది. మధ్యతరగతి ఇళ్ళలో ఉండే ఇబ్బందులు, పొరపొచ్చాలు చాలా బాగా చూపెట్టారని అర్థం అవుతోంది. రాశీ ఖన్నా ఎపిసోడ్ అర్జున్ రెడ్డి సినిమాని గుర్తుకు తెస్తుంది. ఈ ఒక్క అంశం తప్పితే ట్రైలర్ ఆద్యంతం ఆసక్తి గొలుపుతూ, సినిమా కోసం వెయిట్ చేయడానికి కావాల్సిన పూర్తి సరంజామాతో ఉంది.

World famous lover trailer looks interesting..:

Vijay Devarakonda World famous lover trailer launched today

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ