Advertisementt

‘RRR’ రిలీజ్ డేట్‌కు భారీ సినిమా వచ్చేస్తోంది!

Fri 07th Feb 2020 08:02 PM
rrr,rrr release date,kgf,kgf chapter-2,jakkanna,prasanth neel  ‘RRR’ రిలీజ్ డేట్‌కు భారీ సినిమా వచ్చేస్తోంది!
Heavy Budget Movie Coming Same Release Date of RRR!! ‘RRR’ రిలీజ్ డేట్‌కు భారీ సినిమా వచ్చేస్తోంది!
Advertisement
Ads by CJ

‘బాహుబలి’ సినిమాతో తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఫలానా పాత్రల్లో నటిస్తున్నారని మాత్రమే చెప్పిన జక్కన్న.. ఇంతవరకూ చిన్నపాటి లుక్ గానీ రిలీజ్ చేయకపోవడం గమనార్హం. అయితే సినిమాకు సంబంధించి పుకార్లు మాత్రం బోలెడన్ని షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ పుకార్లన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టేసిన జక్కన్న.. ఎవరూ ఊహించని రీతిలో జులై-30 నుంచి ఏకంగా వచ్చే ఏడాది అనగా జనవరి-8, 2021కి పోస్ట్ చేస్తున్నానని.. ఇందుకు గల కారణాలను కూడా వివరించాడు.

అయితే జులై-30ని ఎలాగో రాజమౌళి ఫేమస్ చేసేశాడు గనుక అదే రోజున ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’న రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తున్నదట. అన్నీ అనుకున్నట్లు జరిగితే రాజమౌళిని కూడా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పిలిపించి.. ఆయన చేతనే ప్రమోషన్స్ చేయించాలని చిత్రబృందం యోచిస్తోందట. అలా అయితే కాస్త కలిసొచ్చే అవకాశం ఉందట. వాస్తవానికి ఇప్పటికే జులై-30పై జాతీయ స్థాయిలో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే RRR స్థానంలో ‘కేజీఎఫ్‌’ వస్తోందంతే.. మిగలినదంతా సేమ్ టూ సేమ్ అన్న మాట. ఇక మార్పులుండవని.. ఈ తేదీని లాక్ చేయాలని ప్రశాంత్ నీల్ అనుకుంటున్నాడట. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఉంటుందట. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది.

Heavy Budget Movie Coming Same Release Date of RRR!!:

Heavy Budget Movie Coming Same Release Date of RRR!!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ