Advertisementt

‘RRR’ పక్కాగా ఇండస్ట్రీ హిట్.. నమ్మకముంది!

Fri 07th Feb 2020 11:00 PM
rrr,rrr movie,jakkanna,rajamouli,shobu yarlagadda  ‘RRR’ పక్కాగా ఇండస్ట్రీ హిట్.. నమ్మకముంది!
RRR : I Believe It’s Pakka Hit Movie..! ‘RRR’ పక్కాగా ఇండస్ట్రీ హిట్.. నమ్మకముంది!
Advertisement
Ads by CJ

‘బాహుబలి’ సినిమాతో తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’. ఈ సినిమా కూడా బాహుబలిని మించిపోతుందని.. భారీగానే అంచనాలున్నాయ్. అంతేకాదు ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తుండటంతో ఆ అంచనాలు కాస్త డబుల్ అయ్యాయ్. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి లుక్స్ రానప్పటికీ.. అప్పుడప్పుడు లీక్స్ వస్తుండటంతో వాటిని చూసి సినీ ప్రియులు, చెర్రీ-ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. అయితే ఈ ఏడాదే సినిమా రిలీజ్ ఉంటుందని చెప్పిన జక్కన్న తాజాగా పోస్ట్ పోన్ చేస్తున్నట్లు.. వచ్చే ఏడాది అనగా జనవరి-08, 2021కు అని స్పష్టం చేశారు. దీంతో సినీ ప్రియుల్లో కాసింత అసంతృప్తి నెలకొన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితి.

సినిమాలు పాత్రధారుల గురించి తెలిసినప్పటికీ మూవీ ఎలా ఉంటుంది..? అనేది మాత్రం తెలియరాలేదు. అయితే తాజాగా.. ఇదే విషయాన్ని ఓ నెటిజన్ ‘బాహుబలి’ నిర్మాత శోభూ యార్లగడ్డను అడిగారు. వాస్తవానికి రాజమౌళికి శోభూ మంచి స్నేహితుడు. అందుకే ఆ నెటిజన్ ఏమైనా కథ గురించి ఏమైనా అప్డేట్ ఇస్తాడేమోనని అడిగాడు. వారిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా జరిగిన సంభాషణను ఇప్పుడు చూద్దాం.

నెటిజన్: ఆర్ఆర్ఆర్ కథేంటి..? ఎలా ఉండబోతోంది..? మీ మిత్రుడు జక్కన్న మీతో ఏమైనా కథ పంచుకున్నారా..?

శోభూ: నిజంగా కథేంటో నాకు తెలియదు. నేను ఒకే ఒక్కరోజు మాత్రమే షూటింగ్‌కు వెళ్లాను.. ఆ తర్వాత నేనెప్పుడూ సెట్స్‌కు వెళ్లలేదు. అయితే సినిమా మాత్రం పక్కాగా ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకుంటుందనే నమ్మకంగా నేను చెప్పగలను’ అని ట్విట్టర్‌లో శోభూ రాసుకొచ్చారు. అంటే ఈ చిన్నపాటి విషయం అయినా బయటికొచ్చిందిగా.. ఇది కూడా ఓ  అప్డేట్‌ అని అభిమానులు ఆనందపడుతున్నారు. సినిమాకు సంబంధించి ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్నప్పటికీ ఇంతవరకూ చిన్న లుక్ కూడా లేదు.. ఇక స్టోరీ చెప్పమంటే జక్కన్న అంతా ఆషామాషీగా చెబుతాడా..? థియేటర్‌కు వచ్చినంతవరకూ వేచి చూడక తప్పదు మరి.

RRR : I Believe It’s Pakka Hit Movie..!:

RRR : I Believe It’s Pakka Hit Movie..!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ