హాట్ యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ మూడో సీజన్ లో రన్నరప్ గా నిలిచినప్పటికీ ఆమెకి విన్నర్ అయ్యి బిగ్ బాస్ ట్రోఫీ గెలిచినంతగా అభిమాన గణం పెరిగిపోయింది. బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక వెకేషన్స్ కి చెక్కేసిన శ్రీముఖి.. ఇప్పుడు టివి షోస్ తో బాగా బిజీ. బిగ్ బాస్ ద్వారా ఎంతగా ఫేమ్ అయితే వచ్చిందో.. బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక అంతే తలనొప్పులు మొదలయ్యాయి శ్రీముఖికి. అది కూడా శ్రీముఖి అభిమానుల వలన ఆమె అడ్డంగా ఇరుక్కుంది. వేళాపాళా లేని అభిమానుల ఫోటో సెషన్స్ వలన శ్రీముఖికి ప్రయివేసి కరువయ్యింది అంటూ వాపోతుంది. ఇంతకీ శ్రీముఖి అసహనానికి కారణం ఏమిటయ్యా అంటే.. శ్రీముఖి బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక ఆమెకి అభిమానులు అమాంతం పెరగడమే కాదు శ్రీముఖి అడ్రెస్స్ సంపాదించి ఏకంగా ఆమె ఇంటికే క్యూ కడుతున్నారు.
నీ అభిమానులం అంటూ వేళాపాళా లేకుండా ఫొటోస్ దిగడానికి వచ్చేస్తున్నారు. తాజాగా శ్రీముఖి ఇంటి ముందు అభిమానులు ఫొటోలు దిగుతామంటూ వేళాపాళా లేని టైంలో వచ్చి ఇబ్బంది పెడుతున్నారని శ్రీముఖి అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అలసి సొలసి షూటింగ్ ముగించుకుని ఏదో టైంకి ఇంటికి చేరుతున్నా అని కానీ అభిమానులేమో ఒక్క సెల్ఫీ అంటూ ఇబ్బంది పెడుతున్నారంటూ సోషల్ మీడియా లైవ్ చాట్ లో తెగ బాధపడిపోతోంది. అభిమానులు తన మేనేజర్ కి చెప్పి వస్తే తాను కూడా ఫొటోస్ దిగడానికి, వారితో కాస్త టైం స్పెండ్ చెయ్యడానికి మానసికంగా రెడీ అవుతామని, రెండు మూడు షోస్ తో బిజీగా ఉండే తాను అర్ధరాత్రి దాటాక ఇంటికొచ్చి నిద్రపోయి, మళ్ళీ పొద్దున్నే షూటింగ్ కి వెళ్లాల్సిన టైంలో సెల్ఫీలు, ఫొటోస్ అంటూ అభిమానులు పెట్టే ఇబ్బంది వలన ప్రైవసీ ఉండడం లేదని తెగ బాధపడుతుంది. అభిమానులు కోసమే మేకప్ వేసుకుని రెడీ అయ్యి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటామని అలాంటిది వారే తమని ఇబ్బంది పెడితే ఎలా అంటూ వాపోతుంది. పాపం బిగ్ బాస్ పోరికి బిగ్ బాస్ కష్టాలు మరి.