Advertisementt

మిస్ ఇండియా నుంచి కొత్తగా సాంగ్ వచ్చింది

Sat 08th Feb 2020 06:37 PM
keerthi suresh,miss india,first song,kothaga kothaga,release  మిస్ ఇండియా నుంచి కొత్తగా సాంగ్ వచ్చింది
Miss India Movie Kothaga Kothaga Song Released మిస్ ఇండియా నుంచి కొత్తగా సాంగ్ వచ్చింది
Advertisement
Ads by CJ

‘మహానటి’ కీర్తిసురేష్  నటించిన ‘మిస్ ఇండియా’ నుండి ‘కొత్తగా కొత్తగా’ పాట విడుదల 

‘మహానటి’తో జాతీయ ఉత్త‌మ‌న‌టి అవార్డుని ద‌క్కించుకున్న కీర్తిసురేశ్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ మిస్ ఇండియా. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌రేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని మార్చి నెల‌లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. 

సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఈ చిత్రంలో తొలి పాట‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 

‘‘కొత్తగా కొత్త‌గా కొత్త‌గా రంగులే నింగిలో పొంగి సారంగ‌మై

లిప్త‌లో క్షిప్త‌మై కాన‌నే కాల‌మే మొల‌క‌లే వేసె నా సొంత‌మై...’’ అంటూ సాగే ఈ పాట‌లో హీరోయిన్ జీవితంపై త‌న‌కున్న పాజిటివ్ దృక్ప‌థాన్ని తెలియ‌జేస్తుంది. ఈ సాంగ్‌ను యూర‌ప్‌లో అంద‌మైన లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించారు. 

మ్యూజిక‌ల్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందించిన ఈ పాట‌కు క‌ల్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి సాహిత్యం అందించారు. శ్రేయా ఘోష‌ల్, త‌మ‌న్ పాట‌ను పాడారు. 

ఈ సంద‌ర్భంగా... 

నిర్మాత మ‌హేష్ కోనేరు మాట్లాడుతూ - ‘‘మ‌హాన‌టితో జాతీయ ఉత్త‌మ‌నటిగా అవార్డును సంపాదించుకున్న కీర్తిసురేశ్‌ గారు మ‌న‌కు గ‌ర్వ కార‌ణంగా నిలిచారు. త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె జాతీయ అవార్డు గెలుచుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం మా బ్యానర్‌లోనే కావడం మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌ర‌పుకుంటోంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మార్చి నెల‌లో విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు. 

న‌టీన‌టులు:

కీర్తి సురేశ్‌

జ‌గ‌ప‌తిబాబు

వి.కె.న‌రేశ్‌

న‌వీన్ చంద్ర‌

న‌దియా

రాజేంద్ర ప్ర‌సాద్‌

భాను శ్రీ మెహ్ర‌

పూజిత పొన్నాడ‌

క‌మ‌ల్ కామ‌రాజు త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌: ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌

నిర్మాత‌:  మ‌హేశ్ కోనేరు

ద‌ర్శ‌క‌త్వం: న‌రేంద్ర నాథ్‌

కెమెరా:   సుజిత్ వాసుదేవ్‌, డాని షాన్‌సెజ్ లోపెజ్‌

ఎడిటింగ్‌:  త‌మ్మిరాజు

ఆర్ట్‌:  సాహి సురేశ్‌

ర‌చ‌న‌:  న‌రేంద్ర‌నాథ్‌, త‌రుణ్ కుమార్‌

Miss India Movie Kothaga Kothaga Song Released:

Keerthi Suresh Miss India First Song Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ