Advertisementt

అనసూయను ఓ ఆట ఆడుకుంటున్నాడుగా!!

Sat 08th Feb 2020 08:56 PM
hyper aadi,punch,anchor anasuya,jabardasth,manjusha,madhavi latha  అనసూయను ఓ ఆట ఆడుకుంటున్నాడుగా!!
Hyper Aadi Targes Anchor Anasuya in Jabardasth అనసూయను ఓ ఆట ఆడుకుంటున్నాడుగా!!
Advertisement
Ads by CJ

జబర్దస్త్‌లో హైపర్ ఆది పంచ్ లకు ఫిదా అవ్వని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడు. పంచ్‌ల మీద పంచ్‌లతో ప్రేక్షకులను ఉబ్బితబ్బిబ్బు చేస్తుంటాడు. అలాంటి ఆది.. వారానికో అమ్మాయి అదేనండీ ఓ హాట్ యాంకర్‌తో జబర్దస్త్ స్టేజ్ మీద రొమాన్స్ చేస్తూ అందరిని మాయ చేస్తాడు. తన టీంతో కలిసి హైపర్ ఆది చేసే రచ్చకి జడ్జెస్ కూడా పడిపడి నవ్వాల్సిందే. అయితే హైపర్ ఆది ఎక్కువగా అనసూయని తనతో పాటు స్టేజ్ మీద డాన్స్ చెయ్యడానికి తీసుకురావడమే కాదు... ఆమెతో స్కిట్స్ కూడా చేయించేసాడు. అనసూయ కూడా ఆదితో కంఫర్ట్‌గానే ఫీల్ అయ్యేది. అయితే హైపర్ ఆది ఈమధ్యన అనసూయని పక్కన బెట్టి... మిగతా యాంకర్స్ మీద కన్నేశాడు.

కన్నెయ్యడమేమిటి వారానికో హాట్ యాంకర్‌తో అనసూయని ఉడికిస్తున్నాడు. గత వారమైతే.. ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో లాంచ్‌లతో బాగా బిజీగా ఉంటున్న యాంకర్ మంజూషని స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు. అనసూయ ముందు వయ్యారాలు పోతూ... మంజూషతో ఆది రొమాంటిక్ స్కిట్ చేసి హిట్ కొట్టాడు. ఇక తాజాగా జబర్దస్త్ ప్రోమోలో ఈసారి ఆది ఎవరిని తీసుకొచ్చాడో తెలుసా.. మాజీ హీరోయిన్ కం బిజెపి పార్టీ కార్యకర్త అయిన మాధవి లతని. ఇక ఆది, మాధవి లతతో రొమాన్స్ చేస్తుంటే.. హాట్ యాంకర్ అనసూయ మాత్రం అలా చూస్తుండిపోయింది. ఈలోపు జడ్జ్ స్థానంలో ఉన్న రోజా ఎప్పటిలాగే ఇక్కడేదో కాలుతున్న వాసన వస్తుంది అంటూ.. అనసూయ - ఆదికి కలిపి పంచ్ వెయ్యడం మాత్రం అదుర్స్. మరి ఆది కావాలనే అనసూయని ఏడిపిస్తున్నట్టుగా అనిపించడం లేదూ!

Hyper Aadi Targes Anchor Anasuya in Jabardasth:

Hyper Aadi Punches on Anchor Anasuya in Jabardasth

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ