Advertisementt

పివియమ్‌ జ్యోతి ఆర్ట్స్‌ కొత్త చిత్రం మొదలు!

Sun 09th Feb 2020 12:21 AM
pvm jyothi arts,production no 1,movie,opening,details  పివియమ్‌ జ్యోతి ఆర్ట్స్‌ కొత్త చిత్రం మొదలు!
PVM Jyothi Arts Production No 1 Movie Opening Details పివియమ్‌ జ్యోతి ఆర్ట్స్‌ కొత్త చిత్రం మొదలు!
Advertisement
Ads by CJ

పివియమ్‌ జ్యోతి ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌ నెం-1 కొత్త చిత్రం షూటింగ్‌ ప్రారంభం!!

పివియమ్‌ జ్యోతి ఆర్ట్స్‌ పతాకంపై మహి రాథోడ్‌ హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న ప్రొడక్షన్‌ నెం-1 చిత్రం షూటింగ్‌ ఈ రోజు రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. శివ పాలమూరి దర్శకత్వం వహిస్తున్నారు. రేణుక బైరాగి హీరోయిన్‌. దిల్‌ రమేష్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ముహూర్తపు సన్నివేశానికి నటుడు దిల్‌ రమేష్‌ క్లాప్‌నివ్వగా నిర్మాత సిస్టర్‌ మణి కెమెరా స్విచాన్‌ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల  సమావేశంలో దర్శకుడు శివ పాలమూరి మాట్లాడుతూ..‘‘దర్శకుడుగా ఇది నా తొలి చిత్రం. నేటి సమాజంలో ప్రేమ, పెళ్లిళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూపిస్తూ పూర్తి స్థాయి కమర్షియల్‌ చిత్రంగా మా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఫిబ్రవరి 14 న రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి సింగిల్‌ షెడ్యూల్‌ లో షూటింగ్‌ పూర్తి చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. అధిక శాతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరిస్తాం. ఇందులో దిల్‌ రమేష్‌ గారు హీరోయిన్‌ ఫాదర్‌ గా నటిస్తున్నారు. త్వరలో టైటిల్ ప్రకటిస్తాం’’ అన్నారు.

నటుడు దిల్‌ రమేష్‌ మాట్లాడుతూ...‘‘యాత్ర సినిమా తర్వాత నాకు మంచి పాత్రలు పడుతున్నాయి. ఈ సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నా. ఒక  ఇన్నోసెంట్ కుర్రాడు ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది సినిమా. పాత్రకు తగ్గట్టుగానే నేచరల్‌గా ఉండటానికి ఒక ఇన్నోసెంట్‌ కుర్రాడిని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నారు’’ అన్నారు.

హీరో, నిర్మాత మహి రాథోడ్‌ మాట్లాడుతూ...‘‘దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నా. ఇందులో ఇన్నోసెంట్‌ క్యారక్టర్‌ లో నటిస్తున్నా’’ అన్నారు.

హీరోయిన్‌ రేణుక బైరాగి మాట్లాడుతూ...‘‘తెలుగులో  నా ఫస్ట్‌ ఫిలిం ఇది. నా క్యారక్టర్‌ చాలా ట్రెండీగా, డిఫరెంట్ గా ఉంటుంది’’ అన్నారు.

సంగీత దర్శకుడు కన్ను సమీర్‌ మాట్లాడుతూ..‘‘నేను గతంలో సంగీత దర్శకులు ఇయస్‌ మూర్తి, కళ్యాన్‌ మాలిక్‌, సాయి కార్తిక్‌ గార్ల వద్ద అసిస్టెంట్‌గా పని చేశాను. అలాగే మరాఠీ, కన్నడ చిత్రాలకు మ్యూజిక్‌ చేశాను. ఆ అనుభవంతో ఈ సినిమాకు మ్యూజిక్‌ చేస్తున్నా. ప్రస్తుతం పాటల రికార్డింగ్‌ జరుగుతోంది’’ అన్నారు.

మహి రాథోడ్‌, రేణుక బైరాగి, దిల్‌ రమేష్‌, జబర్దస్త్‌ రాజశేఖర్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: కన్ను సమీర్‌, ఎడిటింగ్‌: ఉద్దవ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌, నిర్మాత: మహి రాథోడ్‌, రచన దర్శకత్వం: శివ పాలమూరి. 

PVM Jyothi Arts Production No 1 Movie Opening Details:

PVM Jyothi Arts Production No 1 Movie Started

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ