సాయి పల్లవితో కలిసి శర్వానంద్ పడి పడి లేచె మనసు అనే డీసెంట్ లవ్ స్టోరీతో సినిమా చేసాడు. అది హిట్ అన్నారు కానీ.. సినిమాకి కలెక్షన్స్ రాక ప్లాప్ లిస్ట్ లోకెళ్ళిపోయింది. ఇక కాజల్ అగర్వాల్‌తో రణరంగం అంటూ మాస్ సినిమా చేసి డిజాస్టర్ అందుకున్న శర్వానంద్ ఇప్పుడు.. జాను అనే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేసాడు. తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో సమంత మెయిన్ లీడ్‌లో శర్వానంద్ హీరోగా నటించాడు. ఈ సినిమా శుక్రవారం విడుదలై డీసెంట్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. రివ్యూ రైటర్స్ నుండి హిట్ మార్కులేయించుకుంది. ఈ సినిమాలో శర్వానంద్ నటన అద్భుతం. రామచంద్రగా అలియాస్ రామ్‌గా శర్వా అదరగొట్టేసాడు. వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్‌గా శర్వా సూపర్‌గా సెట్ అవడమే కాదు సమంత పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా ఆమెని లైఫ్ లాంగ్ ఆరాధించే పాత్రలో శర్వా నటన సింప్లి సూపర్బ్.
అసలు సినిమా మొత్తం మీద చూసుకుంటే శర్వాదే పైచేయి అవుతుంది. సమంత కూడా సూపరే. కానీ శర్వా పాత్ర నిడివి ఎక్కువ కావడం మాత్రమే కాదు ఫోకస్ అతని మీద ఎక్కువ వుండడం కూడా శర్వాకి కలిసొచ్చింది. అయితే 96 సినిమాలో పాత్ర స్వభావ రీత్యా విజయ్ సేతుపతితో పోలికలు కనిపించినప్పటికీ శర్వా కొన్ని చోట్ల తనదైన పెర్ఫామెన్స్‌తో ప్రత్యేకతను చాటుకున్నాడు. క్లోజప్ షాట్లతో శర్వా వంక పెట్టలేని నటనతో కట్టిపడేశాడు. తన కోసం జాను ఎదురు చూసిందన్న విషయం తెలిసినప్పుడు శర్వా హావభావాలు వావ్ అనిపిస్తాయి. జాను టచ్ చేసినప్పుడు శర్వానంద్ అదోలా అయిపోవడం, అలాగే జాను నువ్వు వర్జిన్ వా అని ఆడినప్పుడు శర్వా ఎక్స్‌ప్రెషన్స్ అన్ని అదుర్స్. సినిమాలో శర్వానంద్ - సమంతల కెమిస్ట్రీ సినిమాకే మెయిన్ హైలెట్ అనేలా ఉండడం శర్వాకి కలిసొచ్చింది. మరి రెండు ప్లాప్స్‌తో ఉన్న శర్వా జానుతో హిట్ కొట్టేసినట్లే.