Advertisementt

‘ఖలేజా’ నాలాంటోడు చేసుంటే హిట్టయ్యేది!

Mon 10th Feb 2020 03:23 AM
actor sivaji,garuda puranam sivaji,mahesh khaleja,khaleja movie  ‘ఖలేజా’ నాలాంటోడు చేసుంటే హిట్టయ్యేది!
Actor Sivaji Talks about Mahesh Khaleja Movie! ‘ఖలేజా’ నాలాంటోడు చేసుంటే హిట్టయ్యేది!
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, అనుష్క నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘ఖలేజా’. ‘దైవం మానుష రూపేణా’ అనే భావన చుట్టూ అల్లుకున్న కథ ఇది. అయితే.. మహేశ్‌తో సినిమా కావడం.. అది కూడా త్రివిక్రమ్ దర్శకత్వం అనేసరికి అంచనాలు భారీగానే ఉన్నాయ్. సినిమా ఫస్ట్‌లుక్, షూటింగ్ వరకూ ఉన్న అంచనాలు.. రిలీజ్‌ అయ్యి థియేటర్లలోకి వచ్చే సరికి ఆ అంచనాలు పూర్తిగా తప్పాయి. త్రివిక్రమ్ అంటే ఏదో ఆశించి సినిమాకెళ్లిన జనాలు తిట్టుకుంటూ బయటికొచ్చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా మహేశ్‌కు గట్టి దెబ్బే కొట్టింది. 

దూకుడు పెరిగిందప్పుడే!

అప్పుడెప్పుడో ‘అతిథి’ సినిమా సరిగ్గా ఆడకపోయే సరికి ‘ఖలేజా’ అయినా కలిసొస్తుందని భావించినప్పటికీ కథ మళ్లీ అడ్డం తిరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రెండు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యే సరికి మహేశ్ ఫ్యాన్స్ చాలా ఢీలా పడ్డారు. ఆ తర్వాత వచ్చిన ‘దూకుడు’తో మహేశ్‌కు మళ్లీ పాతరొజులొచ్చాయ్.. ఇక దూకుడే అంటూ రంగంలోకి దిగేశాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ ఇక్కడ అవాస్తవం.. అసందర్భం కూడా.

నాలాంటోడు చేసుంటే!?

ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు మళ్లీ తెరపైకి వచ్చాయంటే.. ఇదిగో ఆయనున్నారే అప్పట్లో ‘ఆపరేషన్ గరుడ, వడ, ద్రవిడ’ అంటూ హడావుడి చేశాడే.. అదేనండి శివాజీ ఆయన ఈ ఖలేజా వ్యవహారం మళ్లీ తెరపైకి తెచ్చాడు. టీడీపీ అధికారంలో ఉన్నంతవరకూ గట్టిగానే హడావుడి చేసిన శివాజీ.. వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు ఆయనకు తీరికైంది. తాజాగా ఓ ప్రముఖ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తనకు సంబంధించి.. రాజకీయాలు, సినిమాల గురించి చాలా చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో మహేశ్ ‘ఖలేజా’ సినిమా ప్రస్తావన రాగా.. అసలు ఈ సినిమా ఎందుకు ఆడలేదో అర్థం కాలేదన్నాడు. అంతటితో ఆగని ఆయన ‘బహుశా మహేష్ లాంటి పెద్ద స్టార్ చేయడం వల్లే జనాలకు రీచ్‌ కాలేదేమో. అదే నాలాంటోడు చేసుంటే సినిమా ఓ రేంజ్‌లో ఆడేది. నువ్ దేవుడివి శివాజీ అంటే జనాలకు కనెక్ట్ అయ్యేదేమో’శివాజీ చెప్పుకొచ్చాడు. 

భగ్గుమంటున్న ఫ్యాన్స్!

శివాజీ దేవుడు అంటే.. ఆయనంతకు ఆయనే ఏ రేంజ్‌లో ఊహించుకుంటున్నాడో అర్థమైంది కదా..? అయితే శివాజీ వ్యాఖ్యలపై మహేశ్ వీరాభిమానులు.. అరే బాబూ.. మహేశ్ లాంటి పెద్ద స్టార్ నటిస్తేనే సినిమా ఆ రేంజ్‌కు వచ్చింది.. ఇక మీరు నటిస్తే ఇక చెప్పనక్కర్లేదు.. అసలు తమరికి ఎక్కడ అవకాశాలొస్తున్నాయని ఇలా మాట్లాడుతున్నారంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Actor Sivaji Talks about Mahesh Khaleja Movie!:

Actor Sivaji Talks about Mahesh Khaleja Movie!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ