టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘పింక్’ రీమేక్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తయిపోవచ్చింది. సినిమాకు సంబంధించి ఎలాంటి లుక్స్ కానీ.. వగైరా ఏమీ చెప్పని చిత్రబృందం ఫస్ట్ లుక్ ఎప్పుడు..? రిలీజ్ ఎప్పుడనే విషయం మాత్రం కాస్త క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని జనసేన కార్యకర్తలు, పవన్ వీరాభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ రీమేక్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా ఉందన్న విషయం విదితమే. అందుకే ఇన్ని రోజులుగా గుబురు గడ్డం, మీసాలతో మెరిసిన పవన్.. ఇప్పుడు క్లీన్ షేవ్, వెరైటీగా కటింగ్‌తో దర్శనమిస్తున్నాడు. ఇప్పటికే హైదరాబాద్‌లోని అల్యుమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ వేశారని వార్తలు గుప్పుమన్నాయ్.
అంతేకాదు.. షూటింగ్‌కు పవన్ వెళ్లొస్తున్నాడని తెలియవచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా క్రిష్-పవన్ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. అదేమిటంటే.. ఈ సినిమాలో హాట్ యాంకర్ కమ్ నటి అనసూయ నటిస్తోందట. పవన్ రాబిన్ హుడ్ తరహా బందిపోటు దొంగగా నటిస్తుండగా.. ఆయనతో ప్రగ్యా జైస్వాల్ రొమాన్స్ చేయనుందట. దొంగగా ఉన్న పవన్‌కు సహకరించే మరో పవర్‌ఫుల్ బందిపోటు దొంగ పాత్రలో అనసూయ నటిస్తోందని సమాచారం. ఈ పాత్రే సినిమాకు కీలకం కానుందని తెలుస్తోంది. అంతేకాదండోయ్ ఓ స్పెషల్ సాంగ్‌లో ఈ హాట్ భామ అందాలు ఒలకబోస్తుందట.
అయితే.. గత కొన్ని రోజులుగా అను ట్రైబల్ పాత్రలో నటిస్తోందని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా మాత్రం కీలక పాత్రలో అని పుకార్లు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో. కాగా.. గతంలో ఓ సారి ఆఫర్ రాగా వద్దనుకున్న ఈ అమ్మడు.. ఈసారి మాత్రం ఆ లక్కీ ఛాన్స్ అస్సలు వదులుకోనంటోందట. అయితే ఈ వార్తలో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.