Advertisementt

అబ్దుల్ కలాం బయోపిక్‌పై వాళ్లకే హక్కు ఉందంట!

Mon 10th Feb 2020 10:21 PM
abdul kalam,biopic,rights,abhishek agarwal,abdul kalam,poster,release  అబ్దుల్ కలాం బయోపిక్‌పై వాళ్లకే హక్కు ఉందంట!
Abhishek Agarwal about Abdul Kalam Biopic అబ్దుల్ కలాం బయోపిక్‌పై వాళ్లకే హక్కు ఉందంట!
Advertisement
Ads by CJ

అబ్దుల్ కలాం బయోపిక్ తీసే హక్కు మాకు మాత్రమే ఉంది: అభిషేక్ అగర్వాల్

మాజీ రాష్ట్రపతి, విఖ్యాత సైంటిస్ట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ రైట్స్ తమ వద్ద ఉన్నాయని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ కలాం జీవితంపై ఏ భాషలోనైనా సినిమా, లేదా డాక్యుమెంటరీని నిర్మించే, పోస్టర్లను రిలీజ్ చేసే అధికారిక హక్కులను తాము కలిగివున్నామని ఆయన స్పష్టం చేశారు. డాక్టర్ కలాంకు సంబంధించి ఏ రూపంలోనైనా రిఫరెన్సులు తీసుకొనే చర్యలకు వేరెవరు పూనుకున్నా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఈ సందర్భంగా ‘డాక్టర్ అబ్దుల్ కలాం’ టైటిల్‌తో తాము నిర్మించబోయే మూవీ పోస్టర్‌ను అభిషేక్ అగర్వాల్ విడుదల చేశారు. ‘ఎవ్విరి స్టోరీ హ్యాజ్ ఎ హీరో’ అనే ఉప శీర్షికతో డ్రీమ్ మర్చంట్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు.

 

Abhishek Agarwal about Abdul Kalam Biopic:

Abdul kalam Biopic Rights only for me Says Abhishek Agarwal

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ