Advertisementt

మాట తప్పినందుకు క్షమించండి.. : మనోజ్

Wed 12th Feb 2020 04:48 AM
manchu manoj,actor manoj,sorry,twitter,netizen  మాట తప్పినందుకు క్షమించండి.. : మనోజ్
Manchu Manoj Says sorry.. Details Here.. మాట తప్పినందుకు క్షమించండి.. : మనోజ్
Advertisement
Ads by CJ

అవును మీరు వింటున్నది నిజమే.. మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోయినందుకు టాలీవుడ్ యంగ్ హీరో, మంచువారబ్బాయి క్షమాపణలు చెప్పాడు. అదేంట్బా.. ఇంతకీ ఆయనిచ్చిన మాటేంటి..? కొంపదీసి పెళ్లి గురించా..? అని అనుకుంటున్నారా..? అదేనండి అప్పుడెప్పుడో ఒక్క వారం ఆగండి.. అంటూ పెద్ద పెద్ద సినిమా డైలాగ్ కొట్టాడుగా.. అదేదో తేల్చేశాడా..ఏంటి..? అను అనుకుంటున్నారా..? ఆగండి అక్కడికే వస్తున్నా..! ఇంతకీ ఆ వారం లెక్కేంటో..? ఆయన ఎందుకు క్షమించమని అడిగాడో ఇప్పుడు చూద్దాం.

అసలేం జరిగింది!?

సినిమాలతో అభిమానులు,  సినీ ప్రియులు దగ్గరవ్వడం అనేది పక్కనెడితే సోషల్ మీడియా ద్వారా మాత్రం మనోజ్ నిత్యం అభిమానులకు టచ్‌ల్ ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇందులోనే తనకు సంబంధించిన అన్ని విషయాలను మంచువారబ్బాయి షేర్ చేసుకుంటూ ఉంటాడు. అంతేకాదు.. ఫ్యాన్స్, నెటిజన్లు సలహాలను కూడా పాటించడమే కాదు.. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ ట్వీట్‌కు రిప్లై కూడా ఇచ్చి అవసరమైతే రిట్వీట్ కూడా చేస్తుంటాడు. అయితే గత నెలలో అనగా జనవరి-28న ‘ఫైర్ బాల్‌గా వెలగడానికి అంతా సెట్ అయ్యింది. ఈ వీక్‌లో నా నుంచి ఆసక్తికరమైన అనౌన్స్‌మెంట్ రాబోతోంది. జస్ట్ వెయిట్ అండ్ సీ’ అని ట్విట్టర్‌లో మనోజ్ పోస్ట్ చేశాడు.

క్షమాపణ ఎందుకు!?

అయితే కొంపదీసి ఆయనేమైనా పెళ్లి చేసుకుంటున్నాడా ఏంటి..? అసలు ఏమై ఉంటుంది..? అని అందరూ ఆలోచనలో పడ్డారు. అయితే వారంకు పైగానే అవ్వడంతో ఎంతగానో వేచిచూసిన ఓ వీరాభిమాని ఆ పాత ట్వీట్‌ను షేర్ చేస్తూ.. ఇంతకీ ఏమైందన్నా.. వారం అయిపోయిందిగా అంటూ ప్రశ్నించాడు. దీంతో మళ్లీ ట్విట్టరెక్కిన మనోజ్.. ఇందుకు స్పందిస్తూ ‘సారీ తమ్ముడూ.. ఇంకొంచెం టైం వెయిటింగ్.. అంతే..’ అని నవ్వుతున్న, ఏడుస్తున్న, దండంపెడుతున్నట్లున్న మూడు ఎమోజీలను మనోజ్ పోస్ట్ చేశాడు. అయితే ఇంతకీ మనోజ్ ఏం చెప్పబోతున్నాడు..? మాత్రం అర్థం కావట్లేదు. చివరికి ఏం తేలుస్తాడో..? ఏంటో..!

Manchu Manoj Says sorry.. Details Here..:

Manchu Manoj Says sorry.. Details Here..  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ