Advertisementt

‘అసురన్‌’ డైరెక్టర్‌కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్!?

Thu 13th Feb 2020 12:15 AM
jr ntr,asuran director,vetri maaran,asuran  ‘అసురన్‌’ డైరెక్టర్‌కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్!?
Jr NTR to star in a film by Asuran director Vetri Maaran? ‘అసురన్‌’ డైరెక్టర్‌కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్!?
Advertisement
Ads by CJ

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, వెట్రి మారన్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘అసురన్’. దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదలైన ఈ చిత్రం తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ధనుష్.. డబుల్‌ రోల్‌లో చేయగా.. ఈయన సరసన మంజువారియర్ నటించింది. ఈ సినిమా చూసిన పెద్ద పెద్ద స్టార్‌లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదండోయ్.. ఈ సినిమాను తెలుగు స్టార్ హీరోలు కూడా మెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాను తెలుగులో వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నారప్ప’గా రాబోతోంది.

అయితే.. వెట్రి మారన్ తెరకెక్కించిన విధానం.. ఇదివరకు సినిమాలకు తెలుగు హీరోలు ఫిదా అయిపోయారు. ఇక ఇవన్నీ నిశితంగా గమనించిన.. సన్నిహితులతో చర్చించిన అనంతరం ఆయనతో ఓ సినిమాకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని టాక్. ‘RRR’ తర్వాత ఎన్టీఆర్‌ కోసం పెద్ద పెద్ద డైరెక్టర్లే క్యూలో ఉన్నారు. వీరిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఒకరిద్దరూ లైన్‌లో ఉన్నారని వార్తలు గుప్పమన్నాయ్. అయితే తాజాగా మాత్రం వెట్రి మారన్‌ కూడా లైన్‌లోకి వచ్చాడు. అంటే ఆయన వెయిటింగ్ డైరెక్టర్ల జాబితాలోకి చేరిపోయారన్న మాట.

వచ్చే ఏడాది ‘RRR’ సినిమా అయితే చాలా టూమచ్ లాంగ్ గ్యాప్.. అయితే తన పాత్రలకు సంబంధించిన సన్నివేశాలు చిత్రకరించేస్తే ఇక షూటింగ్‌ గుడ్ బై చెప్పేసి ఇంటికెళ్లిపోయి ఎంచక్కా ఇంకో సినిమా చూసుకోవాలని ఎన్టీఆర్, చెర్రీ భావిస్తున్నారట. ఇందులో భాగంగానే.. మారన్‌ను ఎన్టీఆర్ లైన్‌లో పెట్టారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఈ కాంబోలో సినిమా ఉంటుందట. ఇందుకు సంబంధించిన వార్త ఒకటి కోలీవుడ్‌లో కోడై కూస్తుండగా.. అక్కడి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారట. కాగా.. ‘వడ చెన్నై’, ‘అసురన్‌’ వంటి చిత్రాలతో ఈ దర్శకుడికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించగా.. తారక్‌తో సినిమా తీసి హ్యాట్రిక్ కొట్టాలని మారిన్ అనుకుంటున్నారట. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో..? తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే. 

Jr NTR to star in a film by Asuran director Vetri Maaran?:

Jr NTR to star in a film by Asuran director Vetri Maaran?  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ