Advertisementt

ఉగాది కానుకగా ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ రిలీజ్

Thu 13th Feb 2020 11:44 PM
orey bujjiga,march 25th,ugaadi festival,raj tharun,malavika nair  ఉగాది కానుకగా ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ రిలీజ్
‘Orey Bujjiga...’ Releasing On Ugaadi Festival ఉగాది కానుకగా ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ రిలీజ్
Advertisement
Ads by CJ

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా...’. ఉగాది కానుకగా మార్చి 25 విడుద‌ల‌వుతుంది. ఇటీవ‌ల విడుద‌లైన ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ.. ‘ఇటీవ‌ల విడుద‌ల చేసిన మా ‘ఒరేయ్ బుజ్జిగా..’ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. రాజ్‌ తరుణ్‌‌కి తగిన యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. మా బ్యాన‌ర్‌లో ‘ఏమైంది ఈ వేళ’, ‘అధినేత’, ‘బెంగాల్ టైగర్’, ‘పంతం’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ ఇది. రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్, అనూప్ రూబెన్స్‌లకు త‌ప్పకుండా మంచి కమర్షియల్ సినిమా అవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్  ప‌నులు జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ఉగాది కానుకగా మార్చి 25 ఈచిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

‘Orey Bujjiga...’ Releasing On Ugaadi Festival:

‘Orey Bujjiga...’ Releasing On Ugaadi Festival  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ