Advertisementt

‘RRR’ ఈ సీన్‌తో గూస్ బంప్స్ పక్కా!!

Fri 14th Feb 2020 12:11 AM
ntr,risky shots,rrr movie,tollywood  ‘RRR’ ఈ సీన్‌తో గూస్ బంప్స్ పక్కా!!
NTR Risky Shots Over RRR Movie! ‘RRR’ ఈ సీన్‌తో గూస్ బంప్స్ పక్కా!!
Advertisement
Ads by CJ

రాజమౌళి ఎన్టీఆర్-రామ్ చరణ్ అభిమానులకి కలిపి షాకిచ్చాడు. ఈ ఏడాదే RRR విడుదల అంటూ ప్రకటించిన రాజమౌళి... సడన్‌గా RRR వచ్చే సంక్రాంతికి అనేశాడు. దానితో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ అభిమానులిద్దరూ తెగ ఫీలవుతున్నారు. తమ హీరోల సినిమాలు వచ్చి రెండేళ్లు గడుస్తున్నా. మల్లీ ఇన్ని రోజులు వెయిట్ చెయ్యాలా అంటూ తెగ బాధపడిపోతున్నారు. ఎన్టీఆర్ అభిమాని ఒకరు మట్లాడుతూ తాను ఆగష్టు లో అమెరికా వెళుతున్న అని.. ఈలోపు అంటే జులై 30 న RRR ఇక్కడ హైదరాబాద్ లో చూసి అమెరికా ఫ్లైట్ ఎక్కాలని అనుకున్నా అని.. కానీ ఆ సినిమా సంక్రాతి రిలీజ్ అంటూ రాజమౌళి చెప్పడంతో కాస్త ఫీల్ అయ్యా అని చెప్పడం బట్టి.. ఎన్టీఆర్, చరణ్ అభిమానులు ఎంతగా ఫీలవుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. అయితే మధ్యమధ్యలో RRR లీక్స్, RRR అప్ డేట్స్ సోషల్ మీడియాలో చూసి కాస్త తృప్తి అపడుతున్నారు ఫాన్స్.

ఇక RRR విషయంలో ఎలాంటి న్యూస్ అయినా పిచ్చ క్యూరియాసిటీ  ఉంటుంది. అందులోనూ ఎన్టీఆర్, చరణ్ సాహసాల విషయం తెలిస్తే.. అది మరింత ఎక్కువవుతుంది. ఇక RRR ఎన్టీఆర్ - పులి కాంబోలో తెరకెక్కిన యాక్షన్ సీన్స్ సూపర్ అంటూ ఎప్పటినుండో ఓ న్యూస్ ప్రచారం లో ఉంది. దానికి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది కూడా. అయితే ఆ క్రేజీ ఫైట్ కోసం ఎన్టీఆర్ చాలా రిస్క్ చేశాడట. ఈ యాక్షన్ సీన్ కోసం రాజమౌళి నిజమైన పులిని వాడారట. ఎన్టీఆర్ - పులి  క్లోజ్ యాక్షన్ సన్నివేశాలను గ్రాఫిక్ చేయనున్న రాజమౌళి.... ఎన్టీఆర్ పులికి ఎదురుపడే సన్నివేశాలలో మాత్రం నిజమైన పులిని ఉపయోగించారట. అయితే ఈ కష్టతరమైన సన్నివేశాలను నిపుణుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ బంధించబడిన పులితో చాల దగ్గరగా చిత్రీకరణ చేసినట్టుగా తెలుస్తుంది. RRR లో పది నిమిషాలకు పైగా ఉండే ఈ సన్నివేశం గూస్ బంప్స్ కలిగించేలా ఉంటుందట. మరి ఎన్టీఆర్ కి సంబందించిన న్యూస్ బయటికిరాగానే ఎన్టీఆర్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు.

NTR Risky Shots Over RRR Movie!:

NTR Risky Shots Over RRR Movie!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ