‘ఉప్పెన’లో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ఫస్ట్ లుక్ విడుదల
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ప్రి-లుక్ పోస్టర్లకు మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. శుక్రవారం వేలంటైన్స్ డేని పురస్కరించుకొని చిత్ర బృందం హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసింది.
ఈ పోస్టర్ లో రంగురంగుల డ్రస్ లో మాస్ లుక్ తో వైష్ణవ్ తేజ్ ఆకట్టుకుంటుండగా, ఒక బస్సులోంచి తల బయటకు పెట్టిచూస్తూ క్యూట్ గా కనిపిస్తోంది కృతి శెట్టి. తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఈ మూవీలో ఒక ప్రముఖ పాత్ర చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ప్రధాన తారాగణం:
పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి, సాయిచంద్, బ్రహ్మాజీ
సాంకేతిక వర్గం:
మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్
సినిమాటోగ్రఫీ: శాందత్ సైనుద్దీన్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: మౌనిక రామకృష్ణ
పీఆర్వోలు: వంశీ-శేఖర్, మధు మడూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై., అశోక్ బి.
సీఈఓ: చెర్రీ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
కథ, దర్శకత్వం: బుచ్చిబాబు సానా
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్