Advertisementt

ఆ మాట నేను అన్లేదే.. : సమంత

Sat 15th Feb 2020 09:24 PM
samantha,gossip,heroine,reaction,heroine samantha  ఆ మాట నేను అన్లేదే.. : సమంత
Samantha Condemned That Gossip ఆ మాట నేను అన్లేదే.. : సమంత
Advertisement
Ads by CJ

సమంత రీసెంట్ మూవీ జానూ సినిమా సూపర్ హిట్ టాక్ తో.. కలెక్షన్స్ పరంగా ప్లాప్ అయినట్లే కనబడుతుంది. జానూ సినిమాలో సమంత నటనకు 100 కి 100 కాదు.. 110 మార్కులు పడ్డాయి. కాకపోతే సినిమా కాస్త స్లో గా ఉండడం, రీమేక్ దెబ్బ సినిమా కలెక్షన్స్ పై పడింది. అయితే జానూ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత రెండేళ్ల వరకు సినిమాల్లో కొనసాగుతానని చెప్పి అందరికి షాకిచ్చింది. దానితో సమంత తల్లావడానికి ప్రిపేర్ అవుతుంది అందుకే సినిమాలు గుడ్ బాయ్ చెప్పేస్తుందేమో? అలాగే సమంత నిర్మాత అవతారం ఎత్తుతుంది అందుకే సినిమాలు ఆపేస్తుందిఅంటూ చర్చ నడిచింది.

 

కానీ తాజాగా సమంత నేను రెండేళ్లలో సినిమాలకు గుడ్ బాయ్ చెబుతానని వస్తున్న వార్తల్లో నిజం లేదని, నా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించి రాసింది అని చెబుతుంది. తాను అలా అనలేదని.. సినిమాల్లో హీరోయిన్స్‌కు ఎక్కువ కాలం ఛాన్స్‌లు రావు కనుక తప్పుకోక తప్పదు అని అన్నాను తప్ప తాను సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతున్నట్లుగా ఎక్కడ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది. అసలు హీరోయిన్‌గా ఛాన్స్‌ వచ్చినా రాకున్నా కూడా తానూ ఖచ్చితంగా సినిమాల్లోనే కొనసాగుతాను అని.. వెబ్‌ సిరీస్‌లు లేదంటే ఏదో ఒకరకంగా ప్రేక్షకులకు దగ్గరగా ఉంటానని అభిమానులకు భరోసా ఇచ్చింది.  సమంత సినిమాల్లోకి తప్పుకుంటుంది అని కంగారు పడిన ఆమె అభిమానులు.. సమంత ఇచ్చిన క్లారిటీ తో ఊపిరి పీల్చుకుంటున్నారు.

Samantha Condemned That Gossip :

Samantha Reaction on Trending Rumour on Her 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ