గత రెండేళ్లుగా రష్మిక హవా టాలీవుడ్‌లో విపరీతంగా పెరిగిపోయింది. వరసగా స్టార్ హీరోలతో జోడికి సిద్దమవుతున్న రష్మిక.. నిన్నగాక మొన్న మహేష్ బాబు తో కలిసి అల్లరి చేసింది. నేడు నితిన్‌తో భీష్మ సినిమాతో ప్రేక్షకులముందుకు రాబోతుంది. రేపు అల్లు అర్జున్ తో జోడి కట్టడానికి రెడీగా ఉంది. మరి ఇంతగా క్రేజున్న రష్మిక మందన్న ముందు భీష్మ హీరో నితిన్ తేలిపోతున్నాడు. ఎందుకంటే మూడు వరస ప్లాప్స్‌తో ఉన్న నితిన్ కన్నా రష్మిక కే క్రేజ్ ఉంది. అందుకే మూవీ టీం కూడా రష్మిక గ్లామర్ మీదే ఫోకస్ చేసి సినిమాని ప్రమోట్ చేస్తుంది.
అందుకే నితిన్ కాస్త ఫీలయినట్లుగా వార్తలొచ్చాయి. కాబట్టి మేకర్స్ కూడా నితిన్ సోలో పోస్టర్స్ వదిలారని అన్నారు. అయితే తాజాగా నితిన్ మాత్రం రష్మిక మీద పగ తీర్చేసుకున్నాడనిపిస్తుంది. ప్రస్తుతం భీష్మ ప్రమోషన్స్ లో ఉన్న నితిన్.. సరదాగా యాంకర్ ని సాయంత్రం పూట మీ డైట్ ఏంటి అని అడిగితే.. దానికి యాంకర్ ఏదో సమాధానం చెప్పింది. అయితే నితిన్ మాత్రం సాయంత్రం పూట మనమంతా ఏ ఉప్మానో, లేదంటే స్నాక్స్, స్వీట్స్ లాంటివి తింటాం అంటూ.. రష్మిక ఈవెనింగ్ డైట్ గురించి చెప్పి రశ్మికకి షాకిచ్చాడు. రష్మిక సాయంత్రం పూట కుక్క బిస్కెట్స్ తింటుంది. ఆ మాట నితిన్ చెప్పడానికి రెడీ అవగానే రష్మిక వద్దు అని బతిమిలాడినా నితిన్ ఆగకుండా చెప్పేసేసరికి రష్మిక బాగా ఫీలైపోయింది. సో ఇలా నితిన్ రష్మిక సీక్రెట్ బయటపెట్టి... రశ్మికపై పగ తీర్చుకున్నాడన్నమాట.