Advertisementt

‘లోకల్ బాయ్’గా వచ్చేందుకు స్టార్ హీరో రెడీ

Tue 18th Feb 2020 02:04 AM
dhanush,local boy,movie,release,february 28  ‘లోకల్ బాయ్’గా వచ్చేందుకు స్టార్ హీరో రెడీ
Dhanush Local Boy Movie Ready to Release ‘లోకల్ బాయ్’గా వచ్చేందుకు స్టార్ హీరో రెడీ
Advertisement
Ads by CJ

కథానాయకుడిగా ధనుష్‌ది విలక్షణ శైలి. ‘రఘువరన్ బీటెక్’ లో సగటు మధ్యతరగతి యువకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘మారి’లో లోకల్ డాన్‌గానూ మెప్పించారు. ‘ధర్మయోగి’లో రెండు పాత్రల్లో వైవిధ్యం చూపించి విజయం అందుకున్నారు. తమిళ ప్రాచీన యుద్ధవిద్య అడిమురై నేపథ్యంలో రూపొందిన ‘లోకల్ బాయ్’ తో ఈ నెలాఖరున తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులోనూ ఆయన ద్విపాత్రాభినయం చేశారు. ‘ధర్మయోగి’ని తెలుగు ప్రేక్షకులకు అందించిన విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సీహెచ్‌ సతీష్‌కుమార్‌, ఈ ‘లోకల్ బాయ్’ను కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు. 

ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘పటాస్’. ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకుడు. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలు. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’, ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’, ‘ఎంత మంచివాడవురా’ సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మెహరీన్ ఈ సినిమాలో హీరోయిన్. స్నేహ మరో హీరోయిన్. ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘ఎవరు’ సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అద్భుత నటన కనబరిచిన నవీన్ చంద్ర విలన్ పాత్ర పోషించారు. తమిళంలో సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. తెలుగులో ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత సీహెచ్‌ సతీష్‌కుమార్‌ విడుదల చేస్తున్నారు.

నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ... ‘‘మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా కోసం ధనుష్ మార్షల్ ఆర్ట్స్ లో స్పెషల్ ట్రయినింగ్ తీసుకున్నారు. ప్రాచీన యుద్ధవిద్య అడిమురై గొప్పదనం వివరించే చిత్రమిది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. ఈ నెల 28న విడుదలవుతున్న సినిమాకు కూడా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. మెహరీన్, స్నేహ, నవీన్ చంద్ర, నాజర్... సినిమాలో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటీనటులు ఎక్కువ. తెలుగు సినిమా చూసిన అనుభూతి ఈ సినిమా ఇస్తుంది. ధనుష్, ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘ధర్మ యోగి’ తెలుగులో మంచి విజయం సాధించింది. ఆ చిత్రాన్ని తెలుగులో మేమే విడుదల చేశాం. ఇప్పుడు ఈ సినిమానూ మేమే విడుదల చేస్తున్నాం. ఈ సినిమా కూడా అంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది’’ అని అన్నారు.

ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్‌ – ఫణి కందుకూరి

ఆడియో: లహరి మ్యూజిక్ ద్వారా విడుదల

కూర్పు: ప్రకాష్ మబ్బు

సంగీతం: వివేక్-మెర్విన్

ఛాయాగ్రహణం: ఓం ప్రకాష్

కథ – స్ర్కీన్‌ప్లే – దర్శకత్వం: ఆర్‌.ఎస్. దురై సెంథిల్ కుమార్

తెలుగులో విడుదల: విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సీహెచ్‌ సతీష్‌కుమార్‌

నిర్మాతలు: సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్

Dhanush Local Boy Movie Ready to Release:

Dhanush Local Boy Movie to release on February 28

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ