సమంత - శర్వానంద్ జంటగా తెరకెక్కిన 96 రీమేక్ జాను సినిమా గత వారం విడుదలై సూపర్ హిట్ టాక్ తో.. డల్ కలెక్షన్స్ తో ట్రేడ్ కి షాకిచ్చింది. జాను సినిమా ప్లాప్ లిస్ట్‌లోకి వెళ్లడానికి రెడీగా ఉండడం చూసి ఇప్పుడు ఓ హీరోయిన్ హ్యాపీగా ఉందని అంటున్నారు. జాను సినిమా రైట్స్ కొన్నప్పుడు దిల్ రాజు ముందుగా సమంతనే హీరోయిన్‌గా అనుకోవడమే తడువు.. సమంతకి 96 సినిమా చూపించగా.. ఆమె త్రిష కేరెక్టర్ చెయ్యడానికి సంకోచించి.. దిల్ రాజుకి ఓకే చెప్పకుండా తప్పించుకోవడంతో. దిల్ రాజు సెకండ్ ఆప్షన్ గా ప్రస్తుతం టాలీవుడ్ టాప్ లెవల్లో ఉన్న రష్మికాని జాను సినిమా హీరోయిన్‌గా చెయ్యమని సంప్రదించాడట.
అయితే రష్మిక దిల్ రాజు ఆఫర్‌కి నో చెప్పడంతో.. తిరిగి సమంతనే బ్రతిమిలాడి దిల్ రాజు ఫైనల్ చేసుకున్నాడు. సో అలా రష్మిక నుండి జాను ప్లాప్ చేజారడంతో.. రష్మిక ఇప్పుడు హ్యాపీగా ఉందట. ఇక భీష్మ ప్రమోషన్స్‌లో రష్మికను జాను వదులుకోవడం గురించి అడగగా.. అది అయిపోయిన విషయం కదా.. నేను చెప్పకూడదు. ష్ అంటూ నవ్వుతూ ఆ మేటర్‌ని కవర్ చెయ్యడం చూస్తుంటే... రష్మిక మామూలుది కాదు... జాను ప్లాప్ నుండి భలేగా తప్పించుకుంది అని అనుకొకమానరు.