Advertisementt

అఫీషియల్: RRR తర్వాత త్రివిక్రమ్‌తోనే..!

Thu 20th Feb 2020 01:08 PM
ntr 30,trivikram,rrr,jr ntr,kalyan ram,s radhakrishna  అఫీషియల్: RRR తర్వాత త్రివిక్రమ్‌తోనే..!
NTR 30 Project with Trivikram Officially Announced అఫీషియల్: RRR తర్వాత త్రివిక్రమ్‌తోనే..!
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అరవింద సమేత చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసినదే. ఇదే కలయికలో ఇప్పుడు మరొక చిత్రం త్వరలో ప్రారంభం కాబోతోంది. RRR చిత్రం తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేయబోయే చిత్రం. హారిక హాసిని మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) మరియు నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి నుండి షూటింగ్‌కు వెళుతుంది. 

ఈ చిత్రాన్ని 2021 వేసవికి విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఎప్పటి నుండో అభిమానులు ఎదురు చూస్తున్న ఈ ప్రకటన బుధవారం అధికారికంగా వెలువడింది. ఇతర నటీనటుల మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం అని చిత్ర బృందం తెలిపింది. 

NTR 30 Project with Trivikram Officially Announced :

Again Aravinda Sametha Combo

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ