పెళ్లి తర్వాత నాగ చైతన్య - సమంత ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే పెళ్ళికి ముందు నటించినట్టుగానే పెళ్లి తర్వాత చైతు - సమంత కలిసి మజిలీ సినిమా చేసి హిట్ కొట్టారు. తర్వాత సమంత సోలోగా తన సినిమాలతో ఇరగదీస్తోంది. మరోపక్క నాగ చైతన్య కూడా బిజీ. తాజాగా జానుతో హిట్ కొట్టిన సమంత హిట్ అయినా జానుకి కలెక్షన్స్ ఎందుకు రాలేదని అడుగుతారేమో అని జాను విడుదల తర్వాత సైలెంట్ అయ్యింది. తాజాగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చైతు సినిమాల విషయంలో తాను జోక్యం చేసుకోనని చెబుతుంది.
సినిమాల ఎంపికలో తన జోక్యం కానీ, కనీసం సలహాలు కానీ ఇవ్వనని చైతు సినిమాల కథలు విషయంలో తన జోక్యం ఏమాత్రం ఉండదని అంటుంది. ఇక తన సినిమాల విషయంలోనూ చైతు కలగజేసుకోడని చెప్పిన సమంత కొన్ని సినిమాలు స్క్రిప్ట్ విన్నప్పుడు సూపర్బ్ గా అనిపిస్తాయని.. కొంతమంది దర్శకులు స్క్రిప్టు వివరించే విధానం అద్భుతంగా ఉంటుంది కానీ.. సినిమాని తెరకెక్కించే విధానం మాత్రం తేలిపోతుంది అని కానీ ఆ విషయంలో నా వరకు నేను చాలా లక్కీ అంటుంది సమంత. ఇక సుకుమార్ దర్శకత్వంలో సమంత చేసిన రంగస్థలం సినిమా స్క్రిప్ట్ పూర్తిగా తెలియకపోయినా ఆ సినిమా చేశా అని రామలక్ష్మి పాత్రలో ఏదో మాయ ఉంది అని అనుకోబట్టే ఈ సినిమా చేశా అని నా నమ్మకం నిజమైందని అంటుంది.