సాధారణంగా హీరోయిన్లకి కెరియర్ చాలా తక్కువ కాలమే ఉంటుంది. ముందు కొత్త అమ్మాయి అనగానే వరుస అవకాశాలు ఇచ్చుకుంటూ పోతారు. ఆ సినిమాలు హిట్ అయ్యాయంటే హీరోయిన్ కి ప్లస్ అవుతుంది. ఒకవేళ అవి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటే ఇక అంతే సంగతి.. మళ్ళీ నిర్మాతలు అవకాశం కూడా ఇవ్వరు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే ఎవరైనా పట్టించుకుంటారు. సక్సెస్ లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా అవకాశాలు రావు..
కుమారి 21 ఎఫ్ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ హెబ్బా పటేల్.. అంతకుముందు ఒకటి రెండు సినిమాల్లో నటించినా అవి ఎలాంటి గుర్తింపు తేలేదు. అయితే కుమారి ౨౧ ఎఫ్ తర్వాత ఆమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ సక్సెస్ మాత్రం రాలేదు. దాంతో హీరోయిన్ గా కెరీర్ అయిపోయిందనే అనుకున్నప్పటికీ కన్ఫర్మ్ చేసుకోలేదు. కానీ ఇప్పుడు భీష్మ సినిమాలో ఆమెను చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ అవుతున్నారు.
సినిమాలో అసలేమాత్రం ఇంపార్టెన్స్ లేని పాత్రే కాకుండా వ్యాంప్ తరహా కావడంతో అందరూ షాక్ కి గురవుతున్నారు. హెబ్బా పటేల్ లాంటి హీరోయిన్ అలాంటి పాత్రలో కనిపించడంతో ఆమెకి ఇండస్ట్రీలో ఆఫర్లు ఏమాత్రం ఉన్నాయో స్పష్టంగా అర్థమైపోతుంది. ఈ సినిమా సక్సెస్ అయినా హెబ్బా పటేల్ కి ఎలాంటి లాభం ఉండదు. పోగా ఇంకా నష్టం వచ్చే అవకాశమే ఎక్కువ. ఎంత కరువులో ఉన్నా ఇలాంటి క్యారెక్టర్లు చేయడానికి కొంత ఆలోచిస్తే మంచిదని అంటున్నారు. హీరోయిన్ స్థాయిలో ఉండి ఇలాంటి చిన్న చితకా క్యారెక్టర్లు చేస్తే పూర్తిగా వాటికే పరిమితం అయిపోవాల్సి వస్తుందని సలహా ఇస్తున్నారు. మరి ఈ సలహాలు తీసుకుని ఇకముందైనా జాగ్రత్త పడి ఇలాంటి వ్యాంప్ క్యారెక్టర్లు మానుకుంటుందేమో చూడాలి.