ఓ పదేళ్లు హిట్ అనే పదమే లేకుండా సినిమాలు చేసి మళ్ళీ రెండు మూడు వరస హిట్స్ తో నితిన్ హీరోగా కెరీర్ లో నిలదొక్కుకున్నాడు. మళ్ళీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అ.. ఆ సినిమా తర్వాత నితిన్ ఫుల్ ఫామ్ లోకొచ్చేసాడు. అయితే నితిన్ అదే క్రేజ్ తో చేసిన లై, ఛల్ మోహన రంగ, శ్రీనివాస కళ్యాణం ఇలా మూడు వరస ప్లాప్స్ తో హ్యాట్రిక్ కొట్టాడు. వరస ప్లాప్స్ తో సతమతమైన నితిన్ చాలా అలోచించి కాస్త గ్యాప్ తీసుకుని ఛలో హిట్ కొట్టిన వెంకీ కుడుములతో భీష్మ సినిమా చేసాడు. భీష్మ సినిమా ఫస్ట్ లుక్ అప్పటినుండి సినిమాపై భారీ అంచనాలు వచ్చేశాయి. అందులోను సాంగ్స్ ఆకట్టుకునేలా ఉండడం, ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనే కాదు ట్రేడ్ లోను ఆసక్తి పెరిగింది. అదే అంచనాలతో నిన్న విడుదలైన భీష్మకి పాజిటివ్ హిట్ టాక్ పడింది.
దానితో హ్యాట్రిక్ ప్లాప్ లతో ఉన్న నితిన్ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. క్రిటిక్స్ కూడా భీష్మ సినిమాకి పాజిటివ్ కాదు హిట్ రేటింగ్ ఇవ్వడంతో.. మహాశివరాత్రి హిట్ సినిమాగా భీష్మ నిలిచింది. ఇక ఈ హిట్ టాక్ తో భీష్మ కలెక్షన్స్ కొల్లగొట్టడం ఖాయమంటున్నారు. ఎందుకంటే సంక్రాంతి హిట్స్ తర్వాత మళ్ళీ సరైన సినిమా ప్రేక్షకుడికి తగలలేదు. డిస్కో రాజా డిజాస్టర్, తర్వాత వచ్చిన జాను ఓకే కానీ కలెక్షన్స్ నిల్. ఇక తాజాగా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా దెబ్బేయ్యడంతో ప్రేక్షకులు కాస్త నితిన్ భీష్మ మీద ఇంట్రెస్ట్ చూపించడం.. అలాగే సినిమాకి హిట్ టాక్ పడడంతో నితిన్ హ్యాపీ మూడ్ లోకి వెళ్ళాడు.