Advertisementt

వెన్నెల అకౌంట్‌లోకి మరో హిట్టు పాత్ర..!

Mon 24th Feb 2020 09:04 PM
vennela kishore,hit,bheeshma,comedy,nithiin  వెన్నెల అకౌంట్‌లోకి మరో హిట్టు పాత్ర..!
Vennela Kishore Role Highlight in Bheeshma వెన్నెల అకౌంట్‌లోకి మరో హిట్టు పాత్ర..!
Advertisement
Ads by CJ

వెన్నెల కిశోర్ కి చేతినిండా సినిమాలే. కానీ సరైన కేరెక్టర్ వెన్నెల కిషోర్ కి పడడం లేదు. కాబట్టే వెన్నెల కిషోర్ కామెడీ ఏ సినిమాలోనూ హైలెట్ అవ్వడం లేదు. చిన్న చిన్న కేరెక్టర్స్ కే వెన్నెలని సరిపెడుతున్నారు కానీ.. వెన్నెల కిషోర్ కెపాసిటికి తగ్గ కామెడీ కేరెక్టర్ ని దర్శకులు రాయడంలేదనిపిస్తుంది. సాహో లాంటి పాన్ ఇండియా ఫిలింలో నటించిన వెన్నెలకి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ నిన్న విడుదలైన భీష్మ సినిమాలో వెన్నెల కామెడీనే హైలెట్. నితిన్ కేరెక్టర్ తర్వాత అంత ఫన్ పండించింది వెన్నెల పాత్రతోనే.

హీరోల పక్కన ఉండే కేరెక్టర్స్ లో చెలరేగిపోయి కామెడీ చేసే వెన్నెల కిషోర్ కి భీష్మ చిత్రంలో కరెక్ట్ పాత్ర పడింది. అమ్మాయి దొర‌క్క ప్రస్టేట్ అయ్యే నితిన్ ప‌డే తాప‌త్ర‌యాన్ని క‌రువుగా అభివ‌ర్ణిస్తూ కిషోర్ ఫ్ర‌స్టేట్ అయ్యే తీరు అబ్బా కడుపుబ్బా నవ్వించింది. నితిన్ వ‌ల్ల పెద్ద ఉద్యోగం వ‌దులుకుని చివ‌రికి ఎలాంటి ఉద్యోగం చెయ్యాలో తెలియక డ్రైవ‌ర్‌గా సెటిల‌య్యే ప‌రిమ‌ళ్ పాత్ర‌లో వెన్నెల కిషోర్ నటన అద్భుతః. వెన్నెల కిషోర్ స్క్రీన్ మీద క‌నిపించిన ప్ర‌తిసారీ ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా కామెడీతో ఆకట్టుకున్నాడు.

Vennela Kishore Role Highlight in Bheeshma:

Vennela Kishore gets one more hit with Bheeshma

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ