Advertisementt

అలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు... నాని

Mon 24th Feb 2020 06:22 PM
nani,vishwak sen,hit  అలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు... నాని
Nani gibven advice to Young hero అలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు... నాని
Advertisement
Ads by CJ

మిడ్ రేంజ్ హీరోల్లో టాప్ లో ఉన్న హీరో ఎవరని అంటే టక్కున గుర్తొచ్చే పేరు నాని.  స్టార్ హీరోలతో సినిమాలు తీసే దర్శకులకి మిడ్ రేంజ్ హీరోలతో సినిమా తీయాలంటే కనిపించే మొదటి ఆప్షన్ నాని. ఈ మధ్య విజయ్ దేవరకొండ దూసుకువచ్చినా రెండు ఫ్లాపులు పడడంతో ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నాడో చెప్పడం కష్టం. నాని హీరోగా వరుస విజయాలతో తనదైన నటనతో మిడ్ రేంజ్ హీరోల్లో తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు

 

ప్రస్తుతం ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వంలో వి అనే సినిమా చేస్తున్నాడు. మొట్టమొదటి సారిగా ఈ సినిమా నాని నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తున్నాడు. చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అటు హీరోగా సినిమాలు చేస్తున్న నాని ప్రొడక్షన్ ని కూడా మొదలుపెట్టాడు. వాల్ పోస్టర్ పేరుతో బ్యానర్ ని పెట్టిన నాని మొదటి సినిమా అ తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి అదే బ్యానర్ లో విశ్వక్ సేన్ హీరోగా హిట్ అనే సినిమాని నిర్మించాడు.

 

హిట్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులో జరిగింది. రాజమౌళితో సహా అనుష్క కూడా ఈ ఈవెంట్ కి అతిధులుగా వచ్చారు. అయితే ఈ ఈవెంట్ వేడుకగా నాని ఇచ్చిన సలహాని విశ్వక్ సేన్ బయటపెట్టాడు. విశ్వక్ సేన్ ఒక దశలో ఒకేసారి రెండు సినిమాలు చేద్దామని డిసైడ్ అయ్యాడట. అప్పుడు నాని కాల్ చేసి అలా చేయవద్దు అది కరెక్ట్ కాదని వారించాడట. ఒకే టైమ్ లో రెండు సినిమాలు చేయడం వల్ల చాలా నష్టపోతామని, అలా చేయడం ఎంతమాత్రమూ కరెక్ట్ కాదని సలహా ఇచ్చాడట. ఆ సలహా తీసుకునే తాను ఒకేసారి రెండు సినిమాల్లో చేయడం విరమించుకున్నానని విశ్వక్ సేన్ చెప్పాడు. 

Nani gibven advice to Young hero:

Nani given advice to young hero vishwak sen

Tags:   NANI, VISHWAK SEN, HIT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ