Advertisementt

‘హిట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్!

Tue 25th Feb 2020 12:11 AM
nani,vishwak sen,hit movei,pre release,event,highlights  ‘హిట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్!
Hit Movei Pre Release Event Highlights ‘హిట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్!
Advertisement
Ads by CJ

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, అనుష్క శెట్టి ముఖ్య అతిథులుగా.. నేచుర‌ల్ స్టార్ నాని నిర్మాణంలో విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందుతోన్న క్రైమ్ థ్రిల్ల‌ర్‌ ‘హిట్’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై ‘ఫ‌ల‌క్‌నుమాదాస్’ వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా త‌న‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘హిట్‌’. ‘ది ఫ‌స్ట్ కేస్‌’ ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. విశ్వ‌క్ సేన్ ఈ చిత్రంలో విక్ర‌మ్ రుద్ర‌రాజు అనే ఐపీఎస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 28న ఈ సినిమా విడుద‌ల‌ కానుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్‌లో ప్రి రిలీజ్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. 

ఈ కార్య‌క్ర‌మంలో కె.రాఘ‌వేంద్ర‌రావు, ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, రానా ద‌గ్గుబాటి, నాని, అనుష్క శెట్టి, విశ్వ‌క్ సేన్‌, దిల్‌రాజు, రుహాని, న‌రేశ్‌, సందీప్ కిష‌న్‌, మంచు ల‌క్ష్మి, శైలేష్ కొల‌ను, ఎం.ఎం.కీర‌వాణి, రాహుల్ రామ‌కృష్ణ‌, గ్యారీ, మ‌ణికంద‌న్‌, త‌రుణ్ భాస్క‌ర్‌, కార్తికేయ, రాజ్ కందుకూరి, ప్ర‌శాంతి త్రిపిర్‌నేని, ర‌మా రాజ‌మౌళి, వ‌ల్లి, వివేక్ సాగ‌ర్‌, ర‌వివ‌ర్మ‌, రాహుల్ సిప్లిగంజ్‌, బెక్కం వేణుగోపాల్‌, సునీల్‌, న‌వ‌దీప్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

స్నీక్ పీక్‌ను రాజ‌మౌళి విడుద‌ల చేశారు. అలాగే బిగ్ టికెట్‌ను కూడా విడుద‌ల చేశారు. దిల్‌రాజు టికెట్‌ను కొన్నారు. 

ఈ సంద‌ర్భంగా...

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ - ‘‘నాని నిర్మాత‌గా మారాడు. ఎందుక‌య్యాడు? ‘అ!’ సినిమాతో విష‌యాలు నేర్చుకుని ఇప్పుడు హిట్ అంటున్నాడు. త‌ను హీరోగా సినిమాలు చేస్తుంటాడు. త‌న ఆడ‌ని సినిమాలోని త‌ప్పులు స‌రిచేసుకుంటూ ఆడే సినిమాలోని విష‌యాల‌ను అర్థం చేసుకుంటూ ఈ సినిమాకు ‘హిట్’ అనే పేరు పెట్టేశాడు. వెంక‌టేశ్వ‌రుడు సైన్యాధిప‌తి పేరు విశ్వ‌క్ సేనుడు. ఆ పేరు పెట్టుకున్న‌హీరోకి ఆ వెంక‌టేశ్వ‌రుడి ఆశీస్సులు ఉంటాయి. డైరెక్ట‌ర్ శైలేష్‌కి, నానికి, ప్ర‌శాంతికి అభినంద‌న‌లు’’  అన్నారు. 

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి మాట్లాడుతూ - ‘‘హిట్ సినిమాను చాలా బాగా ప్ర‌మోట్ చేస్తున్నారు. టీజ‌ర్‌, ట్రైల‌ర్ చాలా బావుంది. స్టైలిష్‌గా ఉంది. స్నీక్ పీక్ ఐడియా బావుంది. 2012లో ఓ ఇంగ్లీష్ సినిమాలో ముఖ్య‌మైన ఎపిసోడ్‌ను ముందుగానే రిలీజ్ చేశారు. అదేంటి?  మెయిన్ ఎపిసోడ్‌ని స్నీక్ పీక్ అని రిలీజ్ చేస్తే ఎవ‌రు చూస్తారు? అని అనుకున్నాను. కానీ అది చూసిన అంద‌రూ నెక్ట్స్ ఎం జ‌రుగుతుంద‌నే ఆస‌క్తితో సినిమాను పెద్ద హిట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా స్నీక్ పీక్ ఐడియా కూడా అలాగే ఆస‌క్తిగా ఉంది. ఈ సినిమా హిట్ కావాలి.  నానికి, శైలేష్‌కి అభినంద‌న‌లు. ఇది ఫ‌స్ట్ కేస్ అని హిట్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దీని త‌ర్వాత సెకండ్ కేస్‌, థ‌ర్డ్ కేస్ అంటూ హిట్ సినిమాకు ఫ్రాంచైజీ రావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

అనుష్క శెట్టి మాట్లాడుతూ - ‘‘ప్ర‌శాంతి, నాని నా కుటుంబ స‌భ్యుల్లాంటివారు. వారు మంచి కంటెంట్‌తో సినిమా చేస్తార‌ని నాకు తెలుసు. నేను కూడా ఆస‌క్తిగానే ఎదురుచూస్తున్నాను. విశ్వ‌క్‌సేన్‌, రుహాని, శైలేష్‌, నాని, ప్ర‌శాంతి స‌హా అంద‌రికీ అభినంద‌న‌లు’’ అన్నారు. 

దిల్‌రాజు మాట్లాడుతూ - ‘‘ట్రైల‌ర్ చాలా బాగా రీచ్ అయ్యింది. కొత్త సినిమాలు కోసం.. కొత్త టాలెంట్‌ను నాని ఓ హీరోగా ఉన్నా కూడా నిర్మాత‌గా మారి ఎంక‌రేజ్ చేస్తున్నాడు. విశ్వ‌క్ సేన్ స‌హా ఎంటైర్ యూనిట్‌కి ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు. 

రానా ద‌గ్గుబాటి మాట్లాడుతూ - ‘‘ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి విశ్వ‌క్‌సేన్ స్పెష‌ల్‌గా పిలిచాడు. త‌ను మా బ్యాన‌ర్‌లో ఇప్ప‌టికే రెండు సినిమాలు చేసేశాడు. మూడో సినిమాకు రెడీ అయిపోతున్నాడు. అందుకే త‌నంటే నాకు కాస్త జెల‌సీగా ఉంటుంది. త‌ను డేరింగ్ ప‌ర్స‌న్‌. త‌న‌కు హ్యాట్సాఫ్‌. నాని, ప్ర‌శాంతికి అభినంద‌న‌లు. కొత్త క‌థ‌లు రావాల‌ని మాట్లాడ‌కుండా వీళ్లు సినిమాలుగా చేస్తున్నారు. అంద‌రికీ అభినంద‌న‌లు’’ అన్నారు. 

నిర్మాత‌ నాని మాట్లాడుతూ - ‘‘డైరెక్ట‌ర్ శైలేష్ ఈ క‌థ‌ను చెప్ప‌గానే వెంట‌నే చేయాల‌నిపించింది. త‌ను క‌థ‌లు రాస్తుంటాడు. త‌ను బాగా చ‌దువ‌కున్న వ్య‌క్తి. త‌ను సినిమాల్లోకి వ‌స్తానంటే ఎంక‌రేజ్ చేస్తూనే కొంచెం జాగ్ర‌త్త‌లు చెబుతూ వ‌చ్చాను. జాబ్ వ‌దిలి రాకు అని త‌న‌కు ఎప్పుడూ చెబుతుంటాను. త‌ను క‌థ చెప్ప‌గానే సరే! ఓ సినిమా మాత్రం చెయ్ అని చెప్పాను. కానీ సినిమా చూసిన త‌ర్వాత చెబుతున్నాను. శైలేష్ నువ్వు జాబ్‌కి రిజైన్ చేసేయ్ అని న‌మ్మ‌కంగా చెబుతున్నాను. ఈ సినిమాతో శైలేష్ డైరెక్ట‌ర్‌గా ఎంటో నిరూపించుక‌న్నాను. ఈ సినిమా చూస్తే ఫ‌స్ట్ టైమ్ డైరెక్ట‌ర్ చేసిన సినిమా అనిపించ‌దు. ఇక విశ్వ‌క్ గురించి చెప్పాలంటే.. హీరోగా విశ్వ‌క్‌ను అనుకుంటున్న‌ప్పుడు త‌న గురించి ఏం తెలియ‌దు. క‌టౌట్ బావుంద‌ని అనుకున్నాను. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర కాబ‌ట్టి త‌ను సూట్ అయిపోతాడ‌నిపించింది. ఈరోజు సినిమా చూసిన త‌ర్వాత త‌ను ఏ రోల్ అయినా ఇర‌గ‌దీస్తాడ‌నిపించింది. రుహాని చాలా బాగా చేసింది. వివేక్ సాగ‌ర్‌.. చాలా మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. త‌నొక హీరో పాత్ర‌ను పోషించాడు. త‌న‌కు నేను పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఎడిట‌ర్ గ్యారీకి థాంక్స్‌. థ్రిల్ల‌ర్ సినిమాల‌కు ఎడిట‌ర్ అంటే గ్యారీనే గుర్తుకొస్తాడు. నేను, ప్ర‌శాంతి క‌లిసి చేసిన అ! సినిమాను క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ కాలేదు అనుకుంటూ ఉంటారు. కానీ.. నిర్మాత‌గా అ! సినిమా చాలా పెద్ద స‌క్సెస్‌. దాన్ని మించి ‘హిట్’ సినిమా హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్ యూనిట్‌కు నిర్మాత‌లు త‌ర‌పున థాంక్స్‌. ఈ నెల 28న ప్రేక్ష‌కుల‌కు ఎంగేజింగ్‌, ఎంట‌ర్‌టైనింగ్ సినిమాను ఇస్తున్నామ‌ని గ‌ర్వంగా చెబుతున్నాను’’ అన్నారు. 

హీరో విశ్వ‌క్‌సేన్ మాట్లాడుతూ - ‘‘సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ణికంద‌న్‌గారు న‌న్ను ఎంతో బాగా చూపించారు. నేను చ‌నిపోయే లోపు త‌న‌తో డ‌జ‌ను సినిమాలైనా చేస్తాన‌ని అనుకుంటున్నాను. వివేక్‌సాగ‌ర్‌తో మూడోసారి ప‌నిచేస్తున్నాను. త‌ను నా సినిమాల‌కు అద్భుత‌మైన సంగీతం అందించాడు. రుహాని టెరిఫిక్ పెర్ఫామర్‌. ఎడిట‌ర్ గ్యారీ ఎక్స‌లెంట్‌గా ఎడిట్ చేశారు. ఓ సీన్ కూడా మిస్ కాకుండా చూడాల‌నుకుంటారు. నిర్మాత ప్ర‌శాంతి గారికి థాంక్స్‌. చాలా మంచి వ్య‌క్తి. నాని అన్న విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న చాలా స్మార్ట్‌. త‌ను ఇచ్చిన స‌ల‌హాతో నా పాత్ర‌ను బాగా చేయ‌గ‌ల‌ను. డైరెక్ట‌ర్ శైలేష్‌ను నేను సైంటిస్ట్ అని అంటాను. అంద‌రికీ డౌట్ ఉంటే తెలుసుకుంటాం. శైలేష్ మాత్రం చ‌దివేస్తాడు. త‌ను చాలా ఇంటెలిజెంట్‌. సినిమా చూశాను. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. తొలి నిమిషాలు మీరు కూర్చుంటే త‌ర్వాత నేను మిమ్మ‌ల్ని కూర్చో పెడ‌తాను. సినిమా చూసిన త‌ర్వాత క‌చ్చితంగా మాట‌లు రావు. ఎందుకంటే నేను అలా ఎక్స్‌పీరియెన్స్ ఫీల‌య్యాను. ప్రేక్ష‌కులు అలాగే ఫీల్ అవుతారు. తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి థ్రిల్ల‌ర్ రాలేదు. ఈసారి డైలాగ్స్ పెద్ద‌గా లేదు.. డైరెక్ట్‌గా బుల్లెట్ దింపుడే’’ అన్నారు. 

డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను మాట్లాడుతూ - ‘‘ముందుగా మా కుటుంబ స‌భ్యుల‌కు థాంక్స్‌. 2017లో ఈ సినిమా కోసం నానిని క‌లిశాను. ముందు నేను డైరెక్ష‌న్ చేయ‌డానికి రాలేదు. క‌థ‌ను రాసి నానికి ఇస్తే త‌ను మ‌రొక‌రితో డైరెక్ట్ చేయించుకుంటాడ‌నుకున్నాను. క‌థ విన్న నాని బాగా రాసుకున్నావుగా నువ్వే డైరెక్ట్ చెయ్ అని అన్నాడు. నాకంత స్కిల్ లేదు అని నేనంటే క‌థ‌ను ఇంత బాగా రాసుకున్నావుగా నువ్వే డైరెక్ట్ చెయ్ అన్నాడు. మ‌ళ్లీ సిడ్నీకి వెళ్లి డైరెక్ష‌న్ మెళుకువ‌లు నేర్చుకున్నాను. అలా నాని నా లైఫ్‌లో మార్గ‌ద‌ర్శిలా మారాడు. న‌న్ను డైరెక్ట‌ర్‌గా ఇంట్ర‌డ్యూస్ చేసినందుకు నానిగారికి థాంక్స్‌. ఆయ‌న నాపై పెట్టుకున్న న‌మ్మ‌కం వ‌ల్ల ఓ భ‌యంతో సినిమాను బాగా తీశాన‌నే అనుకుంటున్నాను. ఎన్ని సినిమాలు చేస్తానో లేదో తెలియ‌దు కానీ.. నాని గ‌ర్వ‌ప‌డేలా చేస్తాన‌ని మాత్రం చెప్ప‌గ‌ల‌ను. అలాగే ప్ర‌శాంతి గారికి థాంక్స్‌. ఎగ్రెసివ్‌గా ఉండే హీరో కావాలి.. అనుకుని త‌న‌ను వెళ్లి క‌లిశాను. ఐదు నిమిషాల్లో ఇద్ద‌రం క‌లిసిపోయాం. త‌ను నా ప్రాజెక్ట్‌లోకి రావ‌డం వ‌ల్ల నేను అనుకున్న ఔట్‌పుట్ క‌న్నా రెండింత‌లు బాగా వ‌చ్చింది. మ‌ణికంద‌న్‌ గారికి, ఎడిట‌ర్ గ్యారీకి అభినంద‌న‌లు. వివేక్‌సాగ‌ర్ ఎక్స్‌ట్రార్డిన‌రీ బీజీఎం అందించాడు. నా సినిమాకు ప‌నిచేసిన టెక్నిషియ‌న్స్ కార‌ణంగా సినిమా మ‌రో లెవ‌ల్‌కు వెళ్లింది. రుహాని చాలా నేచుర‌ల్‌గా చేసింది. ఎంటైర్ యూనిట్ బాగా స‌పోర్ట్ చేశారు. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. 

అల్ల‌రి న‌రేశ్ మాట్లాడుతూ - ‘‘మంచి కంటెంట్ సినిమాల‌ను స‌పోర్ట్ చేస్తామ‌ని ‘అ!’ సినిమాతో నాని, ప్ర‌శాంతి నిరూపించారు. నాని ఈ సినిమా గురించి నాకు చాలానే చెప్పాడు. విశ్వ‌క్ ఫెంటాస్టిక్ యాక్ట‌ర్‌, శైలేష్‌గారికి, వివేక్‌సాగ‌ర్ స‌హా అంద‌రికీ అభినంద‌న‌లు’’ అన్నారు. 

డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి మాట్లాడుతూ - ‘‘నేను ‘ఓ బేబీ’ సినిమా షూటింగ్ చేస్తున్న‌ప్పుడు విశ్వ‌క్ ‘ఫ‌ల‌క్‌నుమాదాస్‌’ సినిమాను ప్ర‌మోట్ చేసుకుంటున్నాడు. త‌ను మాట్లాడిన మాటొక‌టి త‌ప్పుగా వెళ్లిపోయింది. నేను విశ్వ‌క్‌ను రామానాయుడు స్టూడియోలో క‌లిసి నీకు కాంట్ర‌వ‌ర్సీలు అవ‌స‌రం లేదు. నీ టాలెంట్‌ను న‌మ్ముకో అని చెప్పాను. ఇప్పుడు హిట్ సినిమా త‌న టాలెంట్‌కు ఓ చిన్న ఎగ్జాంపుల్ మాత్ర‌మే. త‌ను భ‌విష్య‌త్తులో హిట్‌తో పాటు బ్లాక్‌బ‌స్ట‌ర్ కూడా కొడ‌తాడు. నాని, ప్ర‌శాంతి మంచి కంటెంట్ ఉన్న సినిమాల‌ను చేస్తున్నారు. ఎంటైర్ యూనిట్‌కి అభినంద‌న‌లు’’ అన్నారు. 

సందీప్ కిష‌న్ మాట్లాడుతూ - ‘‘ఇద్ద‌రు భిన్న‌మైన వ్య‌క్తుల క‌ల‌యికే హిట్ సినిమా. నాని మంచి న‌టుడే కాదు.. చాలా తెలివైన వ్య‌క్తి. త‌ను న‌న్ను చాలా ఇన్‌స్పైర్ చేస్తుంటాడు. విశ్వ‌క్ కాన్ఫిడెంట్ మ‌రో లెవ‌ల్‌లో ఉంటుంది. వీరిద్ద‌రూ క‌లిసి చేస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను.’’ 

రుహాని మాట్లాడుతూ - ‘‘ఇది నా సెకండ్ మూవీ. చాలా పొటెన్షియ‌ల్‌తో చేసిన సినిమా ఇది. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది. శైలేష్ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. రాత్రింబ‌గ‌ళ్లు సినిమా కోసం క‌ష్ట‌ప‌డ్డారు. అలాగే నిర్మాత‌లు నానిగారికి, ప్ర‌శాంతిగారికి అభినంద‌న‌లు’’ అన్నారు.

Hit Movei Pre Release Event Highlights:

Celebrities Speech at Hit Movei Pre Release Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ