Advertisementt

అలా నేను డిమాండ్ చేయలేదు: రకుల్!

Mon 02nd Mar 2020 07:28 PM
rakul preet singh,reveale,truth,tollywood,heroes  అలా నేను డిమాండ్ చేయలేదు: రకుల్!
Rakul Revealed Truth About Tollywood Heroes అలా నేను డిమాండ్ చేయలేదు: రకుల్!
Advertisement
Ads by CJ

సౌత్ లో అవకాశాలు లేని రకుల్ ప్రీత్ ప్రస్తుతం ముంబైకి మకాం మార్చి బాలీవుడ్ అవకాశాలతో కాలం నెట్టుకొస్తోంది. మధ్య మధ్యలో సోషల్ మీడియాలో తన ఫొటోస్ ని షేర్ చేస్తూ బిజీ బిజీ అంటుంది. ఈమధ్యన ఓ సినిమా కోసం బాగా బరువు తగ్గిన రకుల్ ఫిట్ నెస్ మాయలో పడి ఫేస్ లో గ్లో కోల్పోయినట్లుగా ఆమె రీసెంట్ ఫొటోస్ చూస్తే తెలుస్తుంది. రకుల్ మరీ సన్నగా పేస్ ఓ రకమయిన కాంతి విహీనంగా కనబడుతుంది. బాలీవుడ్ కోసం బాగా చిక్కిన రకుల్ మునుపుటి అందాలను కోల్పోయింది.

ఇక సౌత్ లో స్టార్ హీరోలందరిని చుట్టేసిన రకుల్ సౌత్ ఇండస్ట్రీ గురించి నిజాలు మాట్లాడుతుంది. కెరీర్ ఆరంభంలోనే స్టార్ హీరోల అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయని ఇక నేను చేజార్చుకున్న సినిమాల్లో ఇతర హీరోయిన్ చేసిన ఆ సినిమాల్ని ప్లాప్ అయ్యాయని చెప్పిన రకుల్ సౌత్ లో హీరోలకే అధిక ప్రాధాన్యత ఉంటుంది అని వాళ్ళకి అధిక పారితోషకం ఉంటుంది అని చెబుతుంది. హీరోలకు సమానమైన కష్టం హీరోయిన్స్ కి ఉన్నప్పటికీ హీరోయిన్స్ కి అంతగా పారితోషకాలు ఉండవని కాకపోతే సౌత్ హీరోలంటే అభిమానులకుండే పిచ్చి వలన, హీరోల కోసం ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారు కాబట్టే.. హీరోలకు క్రేజ్ ఎక్కువ ఉంటుంది అని.. అందుకే వారికి అధిక పారితోషకాలు అందుతాయని అంటుంది. హీరోలతో సమానమైన రెమ్యూనరేషన్ హీరోయిన్స్ కి కూడా కావాలని నేనెప్పుడూ డిమాండ్ చెయ్యలేదని చెబుతుంది ఈ భామ. 

Rakul Revealed Truth About Tollywood Heroes:

Rakul About Heroes Remuneration

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ