Advertisementt

మహేష్, వంశీ రిలేషన్ బాగానే ఉంది!

Mon 02nd Mar 2020 08:59 PM
vamsi paipally,mahesh babu,namratha,relation,jayasudha,son,marriage reception  మహేష్, వంశీ రిలేషన్ బాగానే ఉంది!
Good Relation Between Mahesh and Vamsi Paidipally మహేష్, వంశీ రిలేషన్ బాగానే ఉంది!
Advertisement
Ads by CJ

మహేష్ బాబుతో వంశీ పైడిపల్లి జర్నీకి ఫుల్ స్టాప్ పడింది. వంశీ మహర్షి తర్వాత మళ్ళీ మహేష్ తో సినిమా ప్లాన్ చేసుకోవడం మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగినా ఆ ప్రాజెక్ట్ మాత్రం పట్టాలెక్కలేదు. కారణం మహేష్ కి స్క్రిప్ట్ నచ్చకపోవడం అంటున్నారు. అయితే మహేష్ మహర్షి అప్పటి నుండి ఫ్యామిలీతో రిలేషన్ కంటిన్యూ చేస్తున్న వంశీ పైడిపల్లి మహేష్ తో సినిమా ఆగిన తర్వాత మహేష్ కి దూరంగా వెళ్లాడని, మహేష్ అల చేసినందుకు బాధపడుతున్నాడని అన్నారు. నిజంగానే మహేష్ ఫ్యామిలీతో వంశీ పైడిపల్లి ఫ్యామిలీ మమేకం అవడం, కూతురు ఆద్యతో మహేష్ కూతురు సితార ఫ్రెండ్ షిప్ చెయ్యడమే కాదు.. సరిలేరు అప్పుడు మహేష్ ని ఈ పిల్లలిద్దరూ ఇంటర్వ్యూ చెయ్యడం, తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టి హడావిడి చెయ్యడం అన్ని జరిగాయి. మహేష్ తో సినిమా ఆగిపోయాక వంశీ పైడిపల్లి మహేష్ ఫ్యామిలీకి దూరమయ్యాడనే న్యూస్ కూడా నడిచింది.

అయితే తాజాగా మహేష్ - వంశీ పైడిపల్లి మధ్యన సినిమా అయితే ఆగింది కానీ రిలేషన్ చెడలేదు అనడానికి ఓ ప్రూఫ్ దొరికింది. అదేమిటంటే రీసెంట్ గా హైదరాబాద్ పార్క్ హైయ్యత్ లో నటి జయసుధ పెద్ద కొడుకు నీహార్ కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్ కి మహేష్ వైఫ్ నమ్రత శిరోద్కర్ తో కలిసి వంశీ పైడిపల్లి హాజరవడం చూసిన వారెవరైనా మహేష్ తో సినిమా ఆగినా మహేష్ ఫ్యామిలీతో వంశీ పైడిపల్లి రిలేషన్ అలాగే ఉందిగా అంటున్నారు. మరి మహేష్ భార్య నమ్రతతో కలిసి వంశీ పైడిపల్లి కూడా వధువరులతో ఫోటో దిగాడు. అలాగే నమ్రతతో పాటు వంశీ కూడా ఉండడం చూస్తుంటే వీళ్ళ రిలేషన్ ఎక్కడా చెక్కు చెదరలేదనిపిస్తుంది.

Good Relation Between Mahesh and Vamsi Paidipally:

Vamsi and Namratha at Jayasudha Son Marriage Reception

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ