నాని హీరోగా సినిమాల మీద సినిమాలు.. అబ్బో ఏ యంగ్ హీరో ఏ మీడియం హీరో చేయలేని సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. గత ఏడాది జెర్సీ సూపర్ బ్లాక్ బస్టర్. కానీ గ్యాంగ్ లీడర్ ప్లాప్. ఈ ఏడాది ‘వి’ తో మరో 20 రోజుల్లో వచ్చేస్తున్నాడు. మరోపక్క టక్ జగదీశ్, టాక్సీవాలా డైరెక్టర్ శ్యామ్ సింఘరాయ్ మరో సినిమా.. ఇలా నాని సినిమాల విషయాలు చెప్పడానికే టైం లేదు అన్నట్టుగా నాని హీరోగా అల్లాడిస్తుంటే.. ఇప్పుడు నిర్మాతగానూ నాని హిట్ తో హిట్ కొట్టేసాడు. హిట్ సినిమాని లో బడ్జెట్ తో తెరకెక్కించిన నానికి అప్పుడే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ హిట్ కి వచ్చేస్తున్నాయి. ఇక నాని నిర్మాతగా లాభాలు వెనకేసుకోవడమే అంటున్నారు.
మరో పక్క థియేట్రికల్ రైట్స్ అమ్మేసి ప్రస్తుతం లాభాల బాటలో ఉన్న నాని ఇప్పుడు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మరింత లాభాలు మూట గట్టుకోబోతున్నాడట. హిట్ సినిమాకి నాని చెప్పిన రేటుకి నాన్ థియేట్రికల్ హక్కులు కొనడానికి ఏ ఛానల్ ముందుకు రాలేదట. నాని కూడా హిట్ మీద నమ్మకంతో సినిమాని అమ్మలేదు. అయితే ప్రస్తుతం హిట్ కొచ్చిన టాక్ తో నాన్ థియేట్రికల్ బిజినెస్ నాని ముందు అనుకున్నదానికన్నా రెండింతలు ఎక్కువ పలుకుతుందట. పలు ఛానల్స్ హిట్ సినిమా హక్కుల కోసం నాని ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారట. మరి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు బుల్లితెర మీద ఆదరణ ఎక్కువ. అందులోను హిట్ టాక్ వచ్చేసింది. దానితో హిట్ ని డబుల్ రేట్లకి కొనేందుకు క్యూ కడుతున్నారట. మరి నాని డేర్ చేసి అమ్మకుండా కూర్చున్నప్పటికీ ఇప్పుడు లాభాలతో నాని ఆకాశంలో ఎగురుతున్నాడన్నమాట.