యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న యూత్ ఎంటర్‌టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా...’. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో ఇటీవల విడుదలైన ‘కురిసెన.. కురిసెన..’ పాటకి ట్రెమండస్ రెస్పాన్ వస్తోంది. తాజాగా మార్చి4(బుధవారం) సాయంత్రం 5.04నిమిషాలకు ఈ చిత్ర టీజర్‌ను పవర్‌ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేశారు.
అమ్మాయిలు బాగా ముదుర్లబ్బా..రిక్వెస్ట్ పెట్టగానే చూస్తారు.. యాక్సెప్ట్ చేయడానికి మాత్రం రెండు రోజులు చేతులు పిసుక్కుంటారు అని రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమయ్యే ఈ టీజర్ ఆద్యంతం హిలేరియస్‌గా ఆకట్టుకుంది. అసలు బాయ్ ఫ్రెండ్ అంటే ఏంటి? ఒక ఫ్లిఫ్ కార్ట్, ఒక స్విగ్గీ, ఒక ఓలా, ఒక బుక్ మై షో, ఒక క్రెడిట్ కార్డ్ అని చెప్పే డైలాగ్ బాగుంది. అలాగే మందుందా? అని హీరోయిన్ అడిగిన ప్రశ్నకి నా దగ్గర పెద్దగా బ్రాండ్స్ లేవమ్మా.. అని నరేష్ చెప్పే డైలాగ్. దానికి సమాధానంగా బాధకి బ్రాండ్స్‌తో పనేంటి డాడీ అని చెప్పే డైలాగ్ మరింత ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లా సాగిన ఈ టీజర్‌లో కామెడీ అండ్ రొమాన్స్‌తో పాటు డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక రాజ్ తరుణ్ కూడా ఫుల్ హుషారుగా కనిపించాడు. మొత్తంగా ఒక నిమిషం ఇరవై సెకండ్ల నిడివిగల ఈ టీజర్ పక్కా యూత్ ఎంటర్‌టైనర్‌గా సినిమాపై అంచనాలని పెంచింది. ఉగాది కానుకగా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలకాబోతుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ.. ‘‘మా ‘ఒరేయ్ బుజ్జిగా..’ టీజర్‌ను విడుదలచేసిన హరీష్ శంకర్‌గారికి ధన్యవాదాలు, ఇటీవల విడుదలైన కురిసెన.. కురిసెన పాటకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు విడుదల చేసిన టీజర్‌కి అంతకన్నా మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకం ఉంది. మా దర్శకుడు విజయ్‌కుమార్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునేలా మంచి విజన్‌తో ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఉగాది కానుకగా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలచేస్తున్నాం. యూత్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘ఒరేయ్ బుజ్జిగా..’మా బేనర్‌లో డెఫినెట్‌గా మరో సూపర్‌హిట్ మూవీ అవుతుంది’’ అన్నారు.
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డాన్స్: శేఖర్, ఆర్ట్: టి.రాజ్‌కుమార్, ఫైట్స్: రియల్ సతీష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కె.కె.రాధామోహన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్.