Advertisementt

‘అదిరింది’ సమీరాను తప్పించడం వెనుక.. వీడియో!

Thu 05th Mar 2020 11:23 AM
reasons,sameera,adirindi comedy show,anchor sameera  ‘అదిరింది’ సమీరాను తప్పించడం వెనుక.. వీడియో!
Reasons Behind Sameera Exit From ADIRINDI Comedy Show! ‘అదిరింది’ సమీరాను తప్పించడం వెనుక.. వీడియో!
Advertisement
Ads by CJ

‘జబర్దస్త్’ ఖతార్నాక్ కామెడీ షో నుంచి బయటికొచ్చేసిన మెగా బ్రదర్ నాగబాబు.. ‘అదిరింది’ అదరగొట్టేద్దామని అనుకున్నాడు. అయితే.. సీన్ రివర్స్ అయింది.. ఆ విషయాలన్నీ ఇక్కడ అప్రస్తుతం.. అసందర్భం. కామెడీ బాగానే ఉంది..? కంటెస్టెంట్స్ మంచిగానే నవ్విస్తున్నారు..? పంచ్‌లు కూడా గట్టిగానే పేలుతున్నాయ్.. జనాలు కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు..? ఇంత జరుగుతున్నా టీఆర్పీ రేటింగ్ దగ్గర ఎందుకు తేడా కొడుతోంది..? అని ఆలోచనలో పడ్డ నాగబాబు.. ఇందుకు తగ్గ చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యాడు. 

ఒకర్ని కాదు ఇద్దర్ని..

ఈ క్రమంలో షోకు యాంకర్‌గా వ్యవహరిస్తున్న సమీరా షరీఫ్‌ను పక్కనెట్టేయాలని.. ఆమె స్థానంలో ఒకర్ని కాదు ఇద్దర్ని తీసుకోవాలని యాజమాన్యానికి సూచించడంతో ఆఖరికి రవి, భాను శ్రీ ని పట్టుకొచ్చారు. అయితే.. సమీరాను ఏ కారణాలతో పక్కనెట్టారనేది క్లారిటీ ఎవరికీ తెలియదు కానీ.. పుకార్లు మాత్రం గట్టిగానే వచ్చేశాయ్. ఆఖరికీ ఆమె ప్రెగ్నెంట్ అని కూడా కొన్ని కొన్ని వెబ్ సైట్లు రాసేశాయ్. ఇలా చిత్ర విచిత్రాలుగా రాసేస్తుండటంతో.. ఇకనైనా స్పందించకపోతే అసలుకే ఎసరు వస్తుందని భావించిన సమీరా ఎట్టకేలకు ఓ వీడియో రూపంలో వివరణ ఇచ్చుకుంది. 

అసలు కారణాలివీ..

‘నేను షో నుంచి తప్పుకోలేదు.. నాపై రకరకాలుగా వార్తలు వస్తున్నాయ్.. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. నాతో 26 ఎపిసోడ్స్‌కు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇప్పుడు వాళ్లే నన్ను తీసేశారు. ఆ విషయం కూడా నాకు డైరెక్టుగా చెప్పలేదు. నేను ప్రెగ్నెంట్ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అందుకే వీడియో ద్వారా క్లారిటీ ఇవ్వాలని మీ ముందుకు వచ్చాను. నేను ప్రెగ్నెంట్ కాదు.. అదంతా అబద్ధమే. షో యాజమాన్యమే నన్ను తీసేసింది. ఇన్ని రోజులుగా నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు’ అని సమీరా వివరణ ఇచ్చుకుంది. 

Reasons Behind Sameera Exit From ADIRINDI Comedy Show!:

Reasons Behind Sameera Exit From ADIRINDI Comedy Show!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ