నందమూరి బాలకృష్ణ- బోయపాటి కాంబోలో సినిమాకు కొబ్బరికాయ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే బాలయ్యకు ఇది 106వ సినిమా కావడంతో కాసింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన ఎవరు నటిస్తున్నారు..? బాలయ్యను ఎవరు ఢీ కొనబోతున్నారు..? మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు..? అనే విషయాలు తెలియరాలేదు కానీ.. పుకార్లు మాత్రం బోలెడన్ని వచ్చాయ్. అయితే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగు చూసింది.
అదేమిటంటే.. బాలయ్య తన పాత సినిమాలోని పాటను ఈ మూవీలో వాడుతున్నాడట. తన సినిమాల్లో బెస్ట్ అండ్ ఎవర్ గ్రీన్ సాంగ్ అయిన ‘బంగారు బుల్లోడు’ లోని ‘స్వాతిలో ముత్యమంత ముద్దులా...’ పాటను రీమేక్ చేయబోతున్నారట. ఈ సినిమా వచ్చి ఇప్పటికీ పాతికేళ్లు దాటినప్పటికీ క్రేజ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. బాలయ్య-రవీనా టాండన్ కలిసి వర్షంలో తడిసి ముద్దవుతూ చేసిన డ్యాన్ అదుర్స్ అంతే. అయితే రవీనా స్థానంలో అంజలీని పెట్టి రీమేక్ చేయాలని బోయపాటికి బాలయ్య సలహా ఇచ్చారట.
వాస్తవానికి.. ఇప్పుడు రీమేక్ ట్రెండ్ గట్టిగానే నడుస్తోంది.. అది సినిమా అయినా.. సాంగ్ అయినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా పరిస్థితి ఉంది. అందుకే ఇదివరకే ‘పైసా వసూల్’ సినిమాలో.. తండ్రి ఎన్టీఆర్ పాట ‘కంటి చూపు చెబుతోంది, కొంటె నవ్వు చెబుతోంది..’ రీమేక్ చేయించాడు. ఇప్పుడు బాలయ్య ‘స్వాతిలో ముత్యమంత ముద్దులా...’ సాంగ్‌ను రీమేక్ చేద్దామని బోయపాటిని పట్టుబట్టాడని తెలుస్తోంది. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచిచూడాల్సిందే.