టైటిల్ చూడగానే ఇదేంటి..? నిజమేనా..? అని అనుకుంటున్నారా..? అవును దాదాపు ఇదే నిజమయ్యే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయ్. మన టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనుష్క శెట్టి. ఈమె ఇదుగో పెళ్లి చేసుకోబోతోంది..? అదుగో పెళ్లి చేసుకోబోతోంది..? అంటూ ఎప్పుట్నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌తో అనుష్క పెళ్లి అని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే పెళ్లి అని కూడా వార్తలు గుప్పుమన్నాయ్. ఆ తర్వాత అవన్నీ పుకార్లేనని ఇరువురూ కొట్టి పడేశారు. ఇటీవలే.. మరోసారి అనుష్క పెళ్లి పెళ్లి వార్తలు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయ్. టీమిండియాకు చెందిన ఓ ప్రముఖ క్రీడాకారుడితో అనుష్క పెళ్లి అనేది ఆ వైరల్ అవుతున్న వార్త సారాంశం. అంతేకాదు.. ఆ ఆటగాడు మరెవరో కాదట.. ఉత్తరాదికి చెందిన వ్యక్తట.. అని వార్తలు పుంకాలు పుంకాలుగా వచ్చేశాయ్..!
తాజాగా.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కుమారుడితో పెళ్లి అని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయ్. ఆ టాప్ డైరెక్టర్ మరెవరో కాదండోయ్.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. ఆయనగారి తనయుడు కేయస్ ప్రకాశ్‌ను అనుష్క పెళ్లాడబోతుందట. ఇందుకు సంబంధించిన వార్తలు గత రెండు మూడ్రోజులుగా ఎటుచూసినా వినిపిస్తూనే ఉన్నాయ్. వీరిద్దరూ ‘సైజ్ జీరో’ సినిమాకు కలిసి పనిచేశారు. నాటి నుంచి అనుష్కను ప్రకాశ్ ఇష్టపడుతున్నాడట. అయితే.. ప్రకాశ్‌కు ఇదివరకే కనిక థిల్లాన్ అనే బాలీవుడ్ రైటర్‌తో పెళ్లి, విడాకులు కూడా అయ్యాయ్..!
ఒకవేళ ఇదే పెళ్లి జరిగితే ప్రకాశ్‌కు రెండో భార్యగా అనుష్క వెళ్లాలన్న మాట. పోనీ ఆయనేమైనా టాప్ డైరెక్టర్ అంటే అదేం కాదు.. ఆయన తండ్రే కానీ.. ఆయన కాదు. మరోవైపు స్వీటీ మాత్రం అబ్బే తనకు అప్పుడే పెళ్లా అంటూ నోరెళ్లబెడుతోంది. ప్రభాస్ మొదలుకుని నిన్న మొన్న క్రికెటర్ వరకూ పెళ్లి వార్తలపై స్పందించిన స్వీటీ.. ప్రకాశ్ విషయంలో మాత్రం రియాక్ట్ అవ్వట్లేదు. అంటే మౌనానికి అర్థమేంటి..? అంగీకారామేనా..!? అసలు ఈ పుకార్లలో నిజానిజాలెంత..? నిజంగానే ప్రకాశ్‌ను స్వీటీ పెళ్లాడబోతోందా..? అనేది తెలియాలంటే ఎవరో ఒకరు రియాక్ట్ అవ్వాల్సిందే మరి.