Advertisementt

‘ప్రేమపిపాసి’ మూడో పాట విడుదల

Sun 08th Mar 2020 12:25 AM
prema pipasi movie,song launch,talasani srinivas yadhav  ‘ప్రేమపిపాసి’ మూడో పాట విడుదల
prema pipasi movie song launch by Talasani Srinivas Yadhav ‘ప్రేమపిపాసి’ మూడో పాట విడుదల
Advertisement
Ads by CJ

తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ‘ప్రేమపిపాసి’ మూడో సింగిల్ లాంచ్ 

జీపీయస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షీ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. ఎస్‌.ఎస్‌. ఆర్ట్‌ ప్రొడక్షన్స్, యుగ క్రియేషన్స్‌ పతాకాలపై రాహుల్‌ భాయ్‌ మీడియా, దుర్గశ్రీ ఫిలిమ్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎస్‌ రామకృష్ణ (ఆర్‌.కె) నిర్మాత. మురళీ రామస్వామి (యం.ఆర్‌) దర్శకుడు. ఈ నెల 13న సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.  ఈ సినిమా నుంచి మూడో సింగిల్ ‘ఐ ఫోన్ అంటి పిల్లంటూ’ అనే సాంగ్‌ని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంచ్ చేశారు. 

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా సాంగ్ చాలా బావుంది. ఈ నెల 13న రిలీజ్ కాబోతున్న సినిమా సక్సెస్ సాధించి టీమ్ అందరికి మంచి పేరు రావాలి’’ అన్నారు. 

దర్శకుడు మాట్లాడుతూ ‘‘ట్రైలర్‌ విడుదలైన తర్వాత సినిమాకి మంచి హైప్‌ వచ్చింది. ఇటీవల మా సినిమా యూనిట్‌తో పాటు కొంతమంది యూత్‌కు సినిమా చూపించాం. అందరూ ఇప్పటి ట్రెండ్‌కన్నా అడ్వాన్డ్స్‌గా ఉందన్నారు. నిజమైన ప్రేమంటే ఎలా ఉంటుందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’’ అన్నారు. ‘‘ట్రైలర్‌కు, ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు బజ్‌ వచ్చింది. సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు జీపీయస్‌. 

prema pipasi movie song launch by Talasani Srinivas Yadhav:

prema pipasi movie 3rd song launched

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ