Advertisementt

కోలీవుడ్ ఫిల్మ్‌కి సమంత బై బై.. కారణం?

Sun 08th Mar 2020 08:04 PM
samantha,kollywood film,nayanthara,vignesh shivan,vijay sethupathi  కోలీవుడ్ ఫిల్మ్‌కి సమంత బై బై.. కారణం?
Samantha Says Goodbye to Kollywood Film కోలీవుడ్ ఫిల్మ్‌కి సమంత బై బై.. కారణం?
Advertisement
Ads by CJ

సమంత జాను సినిమా తర్వాత తెలుగులో మరే తెలుగు సినిమాకి సైన్ చెయ్యలేదు. ప్రస్తుతం కోలీవుడ్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతారతో కలిసి విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కనున్న సినిమాకి ఓకే చెప్పడం.. షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఇప్పటికే ఆ సినిమా టీజర్‌లో సమంత - నయనతార గొడవపడుతున్నట్టుగా ఉన్న సీన్స్ అందరిని ఆకట్టుకుంది. ఇక సమంత కూడా ఇంతవరకు తాను ఇలాంటి అద్భుతమైన స్క్రిప్ట్ వినలేదని.. నయనతార లాంటి టాలెంటెడ్ హీరోయిన్ తోనూ, విజయ్ సేతుపతి లాంటి హీరోతో కలిసి సినిమా చేస్తున్నందుకు గర్వంగా ఉందని ఆ సినిమా ముచ్చట్లు చెప్పింది. ఇక కోలీవుడ్‌లో ఈ సినిమా, అమెజాన్ ప్రైమ్ ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తప్ప సమంత చేతిలో సినిమాలేవీ ఏమి లేవు అని.. ఇక ఆమె సినిమాలు తగ్గించి, నిర్మాణ రంగంలోనూ, స్కూల్ బిజినెస్‌లోను బిజీ కానుంది అని అనుకున్నారు.

తాజాగా కోలీవుడ్ సినిమా నుండి సమంత బయటికొచ్చేసింది అనే టాక్ మొదలయ్యింది. నయనతార - విజయ్ సేతుపతి సినిమా నుండి సమంత సడన్ గా తప్పుకున్నట్లుగా కోలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ ప్రచారంలోకొచ్చింది. కారణాలు తెలియవు కానీ.. సమంత ప్రెగ్నెంట్ అయిన కారణంగానే ఆ సినిమా వదులుకుంది అని, కాదు నయనతారతో విభేదాల కారణంగా సమంత ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది అని, నయనతార బాయ్ ఫ్రెండ్ దర్శకుడు విగ్నేష్ శివన్ నయనతారకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన కారణంగానే సమంత ఈ బడా ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి అసలు సమంత తప్పుకుంది, తప్పుకుంటే దాని వెనుక కారణమేమిటి అనేది సమంత స్పందిస్తేనే కానీ తెలియదు.

Samantha Says Goodbye to Kollywood Film:

Samantha out From Vignesh Shivan Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ