Advertisementt

‘ఉప్పెన‌’లా ‘నీ క‌న్ను నీలి స‌ముద్రం’ దూసుకెళ్తుంది

Mon 09th Mar 2020 05:28 PM
vaishnav tej,uppena movie,first song,10m views,social media  ‘ఉప్పెన‌’లా ‘నీ క‌న్ను నీలి స‌ముద్రం’ దూసుకెళ్తుంది
10M Views to Uppena Movie First Song ‘ఉప్పెన‌’లా ‘నీ క‌న్ను నీలి స‌ముద్రం’ దూసుకెళ్తుంది
Advertisement
Ads by CJ

వైష్ణ‌వ్ తేజ్ ‘ఉప్పెన‌’లోని తొలిపాట ‘నీ క‌న్ను నీలి స‌ముద్రం’కు 10 మిలియ‌న్ వ్యూస్‌.. సోమ‌వారం రెండో పాట విడుద‌ల‌

వైష్ణ‌వ్ తేజ్‌, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా, బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ‘ఉప్పెన’ చిత్రంలోని మొద‌టి పాట‌ను ఇటీవ‌ల స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రిలీజ్ చేసిన విష‌యం విదిత‌మే. దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చ‌గా ఖ‌వ్వాలీ త‌ర‌హాలో సాగే ‘నీ క‌న్ను నీలి స‌ముద్రం’ అనే ఈ పాట స్వ‌ల్ప‌కాలంలో 10 మిలియ‌న్ వ్యూస్ దాటి, ఇటీవ‌లి కాలంలో బాగా పాపుల‌ర్ అయిన పాట‌ల్లో ఒక‌టిగా నిలిచింది.

హీరోయిన్ కృతి శెట్టిపై త‌న‌కెంత ప్రేమ ఉందో ఈ పాట‌లో వైష్ణ‌వ్ తేజ్ చెప్పే విధానాన్ని అతి సుంద‌రంగా తెలియ‌జేశారు. హిందీ లిరిక్స్‌ను ర‌ఖీబ్ ఆల‌మ్‌, తెలుగు సాహిత్యాన్ని శ్రీ‌మ‌ణి ర‌చించిన ఈ పాట‌ను జావెద్ అలీ, శ్రీ‌కాంత్ చంద్ర అత్యంత మార్ద‌వంగా ఆల‌పించారు.

ఆ పాట‌కు వ‌చ్చిన అద్భుత‌మైన స్పంద‌న త‌ర్వాత రెండో పాట‌ను సోమ‌వారం విడుద‌ల చేయడానికి చిత్ర బృందం స‌న్నాహాలు చేస్తోంది. ‘ధ‌క్ ధ‌క్ ధ‌క్’ అంటూ సాగే ఈ పాట‌ను సోమ‌వారం సాయంత్రం 4.05 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు.

త‌మిళ స్టార్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తి ఒక ప్ర‌ధాన పాత్ర పోషిస్తోన్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, షామ్‌ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఉప్పెన ఏప్రిల్ 2న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

ప్రధాన తారాగణం:

పంజా వైష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి, సాయిచంద్, బ్రహ్మాజీ

సాంకేతిక వర్గం:

మ్యూజిక్: దేవి శ్రీప్రసాద్

సినిమాటోగ్రఫీ: షామ్‌ద‌త్ సైనుద్దీన్

ఎడిటర్: నవీన్ నూలి

ఆర్ట్: మౌనిక రామకృష్ణ

పీఆర్వోలు: వంశీ-శేఖర్, మధు మడూరి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై., అశోక్ బి.

సీఈఓ: చెర్రీ

నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్

కథ, దర్శకత్వం: బుచ్చిబాబు సానా

బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్

10M Views to Uppena Movie First Song :

Uppena Movie First Song Creates Sensation in Social Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ